September 5, 2026 10:06 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

ఫ్యామిలీ త‌గాదాకు పొలిటి‘క‌లర్’.. ఏవీ చుట్టూ ఉచ్చు

భూమా మ‌ర‌ణంతో రాజ‌కీయంగా తీవ్ర ప్ర‌తికూల ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటున్న ఏవీ సుబ్బారెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. దాయాది ఫిర్యాదు మేరకు ఆయన్ను అరెస్టు చేసేందుకు పోలీసులు గాలిస్తున్నారు.

December 23, 2020 at 8:00 AM
in Andhra Pradesh, General, Latest News
Share on FacebookShare on TwitterShare on WhatsApp

క‌ర్నూలు జిల్లాకు చెందిన కీల‌క రాజ‌కీయ నేత‌, ఏపీ సీడ్స్ కార్పొరేష‌న్ మాజీ ఛైర్మ‌న్‌, టీటీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి ఇప్పుడు అరెస్ట్ నుంచి త‌ప్పించుకోలేరా? అన్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అరెస్ట్ నుంచి త‌ప్పించుకునేందుకు ఏవీ సుబ్బారెడ్డి ఇప్పుడు ఏకంగా అజ్ఝాతంలోకి వెళ్లిపోయార‌న్న వార్త‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. అస‌లు ఏవీ సుబ్బారెడ్డి కోసం పోలీసులు అంత‌గా ఎందుకు గాలిస్తున్నార‌న్న ప్ర‌శ్న‌లు కూడా ఆస‌క్తి రేకెత్తిస్తున్నాయి.

భూమా మ‌ర‌ణంతో క‌ష్టాలు

టీడీపీ దివంగ‌త నేత భూమా నాగిరెడ్డికి ముఖ్య అనుచ‌రుడిగా కొన‌సాగిన ఏవీ సుబ్బారెడ్డికి… భూమా మ‌ర‌ణంతో క‌ష్టాలు మొద‌ల‌య్యాయ‌ని చెప్పాలి. ఈ క్ర‌మంలో భూమా వార‌సురాలిగా బ‌రిలోకి దిగి మంత్రిగా కూడా ప‌ద‌వి అందుకున్న మాజీ మంత్రి భూమా అఖిల‌ప్రియ‌తో కూడా ఏవీకి త‌గాదాలు మొద‌ల‌య్యాయి. మొత్తంగా రాజ‌కీయంగా తీవ్ర ప్ర‌తికూల ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటున్నా… ఎలాగోలా నిల‌దొక్కుకుంటూ వ‌స్తున్న ఏవీ సుబ్బారెడ్డి చుట్టూ ఇప్పుడు చాలా ప‌క‌డ్బందీగానే ఉచ్చు బిగుస్తోంద‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. త‌న దాయాదీతో నెల‌కొన్న చిన్న వివాదాన్ని కేంద్రంగా చేసుకుని, దానినే అస్త్రంగా మ‌ల‌చిన రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల వ్యూహాల‌తో ఇప్పుడు ఏవీ సుబ్బారెడ్డి అడ్డంగా బుక్క‌వుతారా? అన్న ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి. అయినా ఇప్పుడు ఏవీ చుట్టూ ఎందుకు ఉచ్చు బిగుస్తోంది? దాని నేప‌థ్యం ఏమిటి? ప‌్ర‌స్తుతం ఏవీ ఎక్క‌డున్నారు? అన్న వివ‌రాల్లోకెళితే..

నంద్యాల కేంద్రంగానే రాజ‌కీయాలు న‌డుపుతున్న ఏవీ సుబ్బారెడ్డి సొంతూరు ఆళ్ల‌గ‌డ్డ‌. నంద్యాల‌కు కూత‌వేటు దూరంలో ఉన్న ఆళ్ల‌గ‌డ్డ‌పై ప‌ట్టు సాధించే దిశ‌గా ఏవీ చాక‌చ‌క్యంగా పావులు క‌దుపుతున్నారు. ఈ క్ర‌మంలోనే గ‌డచిన శ‌నివారం ఏవీ సుబ్బారెడ్డి కుటుంబం, ఆయ‌న‌ దాయాదీ మోహ‌న్ రెడ్డి కుటుంబాల మ‌ధ్య చిన్న త‌గాదా జ‌రిగింది. అన్న‌ద‌మ్ముల పిల్ల‌లైన ఏవీ, మోహ‌న్ రెడ్డిలు ప‌క్క‌ ప‌క్క ఇళ్లల్లోనే నివాసం ఉంటున్నారు. వీరి ఇళ్ల మ‌ధ్య ఉన్న ఖాళీ స్థ‌లంలోనే ఏవీ సుబ్బారెడ్డి త‌న కారును పార్క్ చేస్తున్నారు. ఈ కారు పార్కింగ్ విష‌యంలోనే ఇరు కుటుంబాల‌కు చెందిన మ‌హిళ‌ల మ‌ధ్య చిన్న వాగ్వివాదం జ‌రిగింది. ఆ స‌మ‌యంలో ఏవీ ఆళ్ల‌గ‌డ్డ‌లోనే లేర‌ట‌. ఇక ఏవీ దాయాది అయిన మోహ‌న్ రెడ్డి ‌నంద్యాలలో త్రినేత్ర పేరిట లాడ్జి న‌డుపుతూనే… విశ్వ‌హిందూ ప‌రిష‌త్‌లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. శ‌నివారం ఇంటి వ‌ద్ద జ‌రిగిన చిన్న వివాదం, ఆ మ‌రునాడే.. అంటే ఆదివారం ఉద‌యం వాకింగ్‌కు వెళ్లిన మోహ‌న్ రెడ్డిపై గుర్తు తెలియ‌ని వ్యక్తులు దాడికి దిగారు. ఈ దాడిలో మోహ‌న్‌రెడ్డికి గాయాలు కాగా… ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుని వెళ్లిపోయారు.

Must Read ;- వైసీపీ నాయకుడి దౌర్జన్యం.. ఆలయ పూజారులపై రౌడీలతో దాడి

మోహ‌న్‌రెడ్డి ఫిర్యాదుతో..

వ‌రుస‌గా రెండు వివాదాల నేప‌థ్యంలో త‌న‌పై జ‌రిగిన దాడికి ఏవీనే కార‌ణ‌మంటూ మోహ‌న్‌రెడ్డి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై రెండు రోజులుగా పెద్ద‌గా స్పందించ‌ని పోలీసులు… ఏ రాజ‌కీయ శ‌క్తులు ఎంట‌ర‌య్యాయో తెలియ‌దు గానీ… మంగ‌ళ‌వారం వేగంగా స్పందించారు. మోహ‌న్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ప్ర‌తిని చేతిలో పెట్టుకుని రంగంలోకి దిగిపోయిన పోలీసులు.. ఏకంగా ఏవీని అరెస్ట్ చేసేందుకు ఆళ్ల‌గ‌డ్డ‌లోని ఆయ‌న ఇంటి త‌లుపు త‌ట్టారు. అక్క‌డ ఏవీ లేర‌న్న విష‌యాన్ని తెలుసుకున్న పోలీసులు...ఆయ‌న కోసం వేచి చూడ‌టానికి బ‌దులుగా ఏకంగా హైద‌రాబాద్‌లోని ఏవీ నివాసానికి ప‌రుగు అందుకున్నారు. తీరా హైద‌రాబాద్ వ‌చ్చే సరికి అక్క‌డ కూడా ఏవీ లేర‌న్న విష‌యం తెలుసుకుని పోలీసులు ఉట్టి చేతుల‌తోనే తిరుగు ముఖం ప‌ట్టారు. అంతిమంగా ఏవీ అజ్ఝాతంలోకి వెళ్లిపోయార‌న్న వార్త‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. మొత్తంగా చిన్న త‌గాదా, అది కూడా దాయాదుల మ‌ధ్య జ‌రిగిన చిన్న వాగ్వాదం, ఆ క్ర‌మంలోనే మోహన్ రెడ్డిపై జ‌రిగిన దాడితో ముందూ వెనుకా చూసుకోకుండా ఏవీని అరెస్ట్ చేయ‌డ‌మే ల‌క్ష్యంగా పోలీసులు క‌దులుతున్న తీరు చూస్తుంటే… ఈ కుటుంబ త‌గాదాను అడ్డం పెట్టుకుని ఏవీని రాజ‌కీయంగా దెబ్బ కొట్టే య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

Also Read ;- వైవీ ఎంట్రీతో వైపీసీలో.. బావాబామ్మర్దుల సవాల్!

Tags: ap newsBhuma Nagi Reddykurnoolkurnool politicsKurnool: Political Trap on TDP Leader AV Subba Reddylatest telugu news onlinePolitical Newspolitical news onlinepolitical trap on av subba reddytdp leader av subba reddytelugu news
Previous Post

నయన్ – విఘ్నేష్‌ మధ్య దూరం.. ఇంతకీ మేటర్ ఏంటంటే..?

Next Post

మేధావి దెబ్బకు తల పట్టుకుంటున్న జగన్..

Related Posts

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

by లియో డెస్క్
September 5, 2026 5:14 pm

రాష్ట్ర అభివృద్ధి, ప్రాజెక్టుల నిర్మాణంలో ఏపీ సీఎం చంద్రబాబు స్పీడుకి పొరుగు రాష్ట్రాల...

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

by లియో డెస్క్
September 5, 2026 2:33 pm

ఏపీ ప్రభుత్వం విద్యారంగంలో మరో సంచలన, సవాల్‌తో కూడిన నిర్ణయానికి రెడీ అవుతోంది....

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

by లియో డెస్క్
September 4, 2026 7:54 pm

ఏపీ, తమిళనాడు మధ్య ఇండస్ట్రియల్ వార్ పీక్స్‌కు చేరింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద...

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

by లియో డెస్క్
September 4, 2026 6:36 pm

మైదుకూరు MLA పుట్టా సుధాకర్ యాదవ్‌ టార్గెట్‌గా వైసీపీ నేతలు చేసిన కుట్ర...

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

by లియో డెస్క్
September 3, 2026 7:38 pm

దశాబ్దాల కాలంగా పెడింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి కరవు ప్రాంతాల సాగు,...

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

by లియో డెస్క్
September 3, 2026 6:53 pm

ఏపీ ప్రభుత్వం వరుస విజయాలతో దూకుడు మీద ఉంది. ప్రతీ రంగంలో తనదైన...

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

by లియో డెస్క్
September 3, 2026 6:12 pm

సౌత్‌ ఇండియాలో పెట్టుబడుల కోసం రాష్ట్రాల మధ్య పోటీ తీవ్ర స్థాయికి చేరుకుంది....

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

by లియో డెస్క్
September 2, 2026 8:14 pm

ఏపీలో నీళ్లు పారితే తెలంగాణలో రాజకీయం రగులుకుంది. సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టు...

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

by లియో డెస్క్
September 2, 2026 7:28 pm

వెనుకబాటుతనం, తాగు-సాగునీటి ఎద్దడి, వలసలతో కొట్టుమిట్టాడుతున్న ఉత్తరాంధ్రను గోదావరి జలాలు తాకాయి. పోలవరం...

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

by లియో డెస్క్
September 2, 2026 7:05 pm

కూటమి ప్రభుత్వంపై మరోసారి ఫేక్ ప్రచారానికి దిగింది వైసీపీ. ఏదో ఒక ఫేక్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

అక్రమ మద్యం : అస్సాం టు ఆంధ్రప్రదేశ్!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

Lavanya Tripathi

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

8న ప‌రిష‌త్ ఎన్నిక‌లు… 10న కౌంటింగ్

ముఖ్య కథనాలు

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

వెలిగొండ కల సాకారం..జగన్‌ డ్రామాలపై మాగుంట ఫైర్‌..!

మారుతున్న రాయలసీమ రూపురేఖలు.. పవన్‌ నిర్ణయంతో వెలుగులు

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

బాబు తెలివికి కేసీఆర్ హ్యాట్సాఫ్‌..

ఏపీలో సంచలన నిర్ణయం.. ప్రైవేట్ స్కూళ్లలో పేదలకు 25% ఉచిత ప్రవేశాలు..!

లోకేష్‌ కాకినాడ ట్రంప్ కార్డ్.. ఏపీకి హ్యుందాయ్ షిప్‌యార్డ్‌..!

డాక్టర్ రవిప్రకాశ్‌ కిడ్నాప్ వివాదం.. పుట్టా ఫ్యామిలీపై వైసీపీ డ్రామా..!

వెలిగొండ, పోలవరం ఎడమకాలువ.. కూటమి సర్కార్‌ సరికొత్త రికార్డు..!

ఏపీలో 100 శాతం అక్షరాస్యత.. సెప్టెంబర్ 2027 టార్గెట్..!

కాకినాడకి హ్యుందాయ్ పరిశ్రమ.. ఏపీ,లోకేష్‌పై తమిళ యువత అసూయ..!

వెలిగొండపై బీఆర్‌ఎస్‌ రాజకీయం.. జగన్‌ సైలెంట్‌..? రెచ్చగొట్టిన వైసీపీ..

వలసలకు గుడ్‌బై.. గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర సస్యశ్యామలం. .!

మారికవలస స్కూల్‌పై ఫేక్ ప్రచారం.. వైసీపీ మళ్లీ ఫెయిల్..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist