తెలంగాణ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం ఘట్టం ముగిసింది. ఇక పాలనపై పట్టుకుని పట్టుసాధించేందుకు అడుగులు పడనున్నాయి.
తెలంగాణలో దశాబ్ధ కాలంగా కాంగ్రెస్ పురిటినొప్పుల బాధల నుంచి బయటపడింది. కాంగ్రెస్ ఆశా కిరణం రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. ఇక పాలన పగ్గాలను బిగుతుగా పట్టుకుని పట్టుసాధించే దానిపై దృష్టిసారిస్తున్న క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. కాంగ్రెస్ పదేళ్ళ నిరీక్షణకు తెరదించితూ.. నూతన అధ్యాయ రచనకు పావులు కదుపుతోంది. మూడు నెలల్లో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో దక్షిణాది నుంచి గట్టి పట్టుసాధించేందకు వడివడిగా అడుగులు వేస్తోంది.
ఈ క్రమంలో ఆంధ్రా రాజకీయాల్లో వేగంగా సమీకరణలు మారుతున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ లో ఉన్న అంతర్గత కుమ్ములాటలు.., కోవర్టుల లుకలుకలను తక్షణమే సరిచేసి.. ఏపీపై కాంగ్రెస్ ఫోకస్ చేయనున్నది. అశాస్త్రీయంగా రాష్ట్ర విభజన చేసి.. ఆ పాపాన్ని కాంగ్రెస్ బాగానే మూగకట్టుకుంది. ఏపీ విభజన జరిగి పదేళ్ళు కావస్తున్న కేంద్రం నుంచి రావాల్సిన హామీలు ఏ ఒక్కటి నెరవేరలేదు. రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా యువత.. సామాజీకంగా.., ఆర్దికంగా.., ఉపాధిపరంగా కుంగిపోయారు. ప్రత్యేక హోదా.., వెనుకబడి జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజ్, రెవిన్యూ లోటు.., తెలంగాణ నుంచి రావాల్సిన బకాయిలు, ఆస్తి తాలూకు హక్కులు ఇలా.. చెప్పకుంటూపోతే చాంతాడంత హామీల లిస్ట్ అసంబద్ధంగా అలా పడి ఉన్నాయి.
ఈ పదేళ్ళ కాలంలో విభజిత ఏపీకి బీజేపీ ఏం చేసిందో.. అందరికీ అర్ధమైంది. పక్షపాత ధోరణిలో సాగించే రాజకీయాలతో కాంగ్రెస్ ఈ పదేళ్ళుగా అటూ దేశంలోనూ.., ఇటూ తెలుగు రాష్ట్రాల్లో ఏ స్థాయిలో పతనమైందో అందరికీ తెలిసిందే. ఆ పాఠవాలు ద్వారా నేర్చుకున్న అనుభవాలతో దేశ రాజీకీయాలపై పట్టుసాధించేందుకు అడుగులు వేస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను నిట్టనిలువున చీల్చి.. ఏపిని అన్నీ విధాలుగా నష్టపరిచిన కాంగ్రెస్.. ఇక మీదట తాను చేసిన తప్పును.. ఇచ్చిన హామీల రూపంలో నెర్చవేస్తే దిశగా ఇక్కడ ప్రజలకు హామీలు ఇచ్చేందకు సిద్ధమవుతోంది.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఆధారించి పట్టం కడితే.. ఢిల్లీ పీఠాన్ని తిరిగి సాధించుకున్న అనతికాలంలోనే ఏపీ హామీలన్నీ నెరవేర్చి.. ఆ తరువాత వచ్చే అసెంబ్లీలో ఓట్లు అడుగుతాం అన్న ప్రపోజల్స్ ను ఏపీ ప్రజల ముందుకు తీసుకొచ్చేందుకు అడుగులు వేస్తోంది. ఇదే ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో నడుస్తున్నా చర్చ. కాంగ్రెస్ ఇదే వ్యూహాన్ని ఇంప్లుమెంట్ చేస్తే.. ఏపీలో కూడా పొత్తుల రాజకీయం అనివార్యం కాక తప్పదని విశ్లేషణలు ఇప్పటికే ఊపందుకున్నాయి.