55వ రోజు..
బిగ్ బాస్ హౌస్..
8 వారం ఎలిమినేట్ ఎవరు?
ఇదీ బిగ్ బాస్ సీజన్ 4లో ఈవారం ఆసక్తికర అంశం.
ఒకరు ఎలిమినేట్ అవుతారా? ఇద్దరు ఎలిమినేట్ అవుతారా అన్నది చర్చ కూడా నడుస్తోంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో 11 మంది ఉన్నారు. వీరిలో నోయల్ అనారోగ్యం కారణంగా బయటికి వచ్చారు. నోయల్ కు కరోనా అనే ప్రచారం జరుగుతోంది. ఇక హౌస్ లో మిగిలింది పది మంది. వీరిలో ఆరుగురు హౌస్ మేట్స్ నామినేషన్స్ లో ఉన్నారు. వారెవరంటే అమ్మ రాజశేఖర్, అఖిల్, మోనాల్, మెహబూబ్, లాస్య, అరియానా. అంటే డేంజర్ జోన్ లో ఇద్దరు ఉన్నారన్న సుస్పష్టం. మిగతా నలుగురిలో ముగ్గరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ గా ఉన్నారు.
ఎక్కువ ఓట్లు సాధించుకున్న అరియానా, అఖిల్, లాస్య సేఫ్ జోన్ లోకి వెళ్లి పోయే ఛాన్స్ ఉంది. మెహబూబ్, మోనాల్, అమ్మరాజశేఖర్ రిస్క్ జోన్ లో ఉన్నారు. గత వారం అవినాష్, దివిల మధ్య నువ్వా నేనా అన్నంత సస్పెన్స్ నెలకొంది. చివరికి అవినాష్ సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయాడు. దివి ఇంటిముఖం పట్టాల్సి వచ్చింది. ఇక ఈ వారం విషయానికి వస్తే ముగ్గురిలో మోనాల్ సేఫ్ జోన్ లోకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. షో రక్తి కట్టాలంటే మోనాల్ అవసరమే మరి. అందుకే బిగ్ బాస్ ఆమెపై దయచూపే అవకాశాలే ఎక్కువ. ఇక మెహబూబ్ విషయానికి వస్తే అతను మూడు వారాలుగా నామినేషన్స్ లో లేడు.
ఈసారి అతని మెడ మీద కత్తి ఉన్నట్లే. మరి ఈ సోషల్ మీడియా స్టార్ పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. అతను ఎప్పుడు నామినేషన్స్ లోకి వస్తాడా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అసలు నాగవల్లి ఎలిమినేట్ అయిన టైమ్ లోనే మెహబూబ్ ఎలిమినేట్ కావాలి. కానీ ఎందుకో బిగ్ బాస్ అతని మీద దయతలిచాడు. ఆయనకు బిగ్ బాస్ గాడ్ ఫాదర్ అనుకోవాలేమో. మరి ఈ గాడ్ ఫాదర్ ఈసారి అతన్ని ఏంచేస్తాడో చూడాలి. ఈ వారం ఇద్దరు బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్లిపోవాల్సి వస్తే మాత్రం అమ్మరాజశేఖర్, మెహబూబ్ లేనని చెప్పాల్సి ఉంటుంది. డబుల్ ఎలిమినేషన్ లేకుంటే అమ్మ రాజశేఖర్ ప్రమాదకర జోన్ లో ఉన్నట్టే.
నిన్న ఏం జరిగిందంటే?
నిన్నటి బిగ్ బాస్ ఏపీసీడ్ లో అఖిల్, సోహెల్ మధ్య, మొన్న కెప్టెన్సీ టాస్క్ కు సంబంధించిన డిస్కషన్ జరిగింది. మరో పక్క అవినాష్, అమ్మ రాజశేఖర్ అండ్ అరియనా మధ్య నామినేషన్ ప్రాసెసస్ లో అమ్మ రాజశేఖర్ ని నామినేట్ చేసిందుకు రీజన్స్ ఎవరేం చెప్పారన్నదానిమీదనే ఆ చర్చ సాగింది. మరో పక్క అభి, హారిక, లాస్యల మధ్య మోనాల్, హారిక ఇంటి కెప్టెన్ కాకూడదనే టాస్క్ లో భాగంగా యాపిల్ కట్ చేసే ప్రాసెస్ ఉంటుంది. అలా ఎలా నీ యాపిల్ కట్ చేస్తుంది మోనాల్ ? అంతకుముందు మీరు బాగానే ఉన్నారుగా అంటూ చర్చించుకుంటుండగా బిగ్ బాస్ నుంచి ఓ లేఖ వస్తుంది. అందులో ఏముంటుందంటే స్టోర్ రూమ్ లో ఓ వైల్డ్ కార్డు ఎంట్రీ వెయిట్ చేస్తున్నాడు. ఇంటి కెప్టెన్ అరియనా ఆ స్టోర్ రూమ్ లో ఉన్న అతిథిని తీసుకురావాలని బిగ్ బాస్ హుకుం జారీ చేస్తాడు.
అరియనా స్టోర్ రూమ్ కి వెళ్లి చూడగానే అక్కడో టెడ్డీ బేర్ ఉంటుంది. ఓహ్ గెస్ట్ ఇదేనా అనుకుంటూ దాన్ని బయటకి తీసుకొస్తుంది. ఇదే విషయాన్ని ఫన్నీగా అవినాష్, అరియనా మాట్లాడుకుంటుంటారు. అరియనా అప్పుడు సడెన్ గా అంతకుముందు అమ్మ రాజశేఖర్ తన మీద అరిచిన విషయం గుర్తు తెచ్చుకుని ఏడుస్తూ ఉంటుంది. అవినాష్ ఆమెని ఓదారుస్తాడు. ఇంతలో బిగ్ బాస్ అభి, హారికలను కన్ఫెషన్ రూమ్ కి రమ్మంటాడు. బిగ్ బాస్ పిలిచినప్పుడల్లా ఆ జంటలు కన్ఫెషన్ రూమ్ కి రావాల్సి ఉంటుంది. అక్కడ ఓ బోర్డు మీద అభి – హారిక, అమ్మ రాజశేఖర్ – లాస్య, సోహెల్ – మెహబూబ్, మోనాల్ – అఖిల్, అవినాష్ – అరియనా ఫొటోలు ఉంటాయి. బిగ్ బాస్ పిలిచిన జంటలు గా కన్ఫెషన్ రూమ్ కి వెళ్లి అక్కడ టేబుల్ మీద ఉన్న టాగ్స్ ని ఆ బోర్డు లోని ఏ జంటకు ఇవ్వాలనకుంటున్నారో అక్కడ బోర్డులో అతికించాల్సి ఉంటుంది.
అభి, హారిక వెళ్లి అమ్మ – లాస్య జంటకు ‘గజిబిజీ జంట’ అనే టాగ్ పెడతారు. అలాగే మోనాల్ – అఖిల్ వెళ్లి మెహబూబ్ – సోహెల్ కి ‘అబద్ధాలకోరు జంట’ అని, అవినాష్ – అరియనా వెళ్లి అఖిల్ – మోనాల్ ‘అహంకారుల జంట’ అని, మెహబూబ్ – సోహెల్ వెళ్లి అవినాష్ – అరియనాలకు ‘బద్దకస్తుల జంట’ అని, లాస్య – అమ్మ రాజశేఖర్ లు అభి – హారికలకు ‘జీరో టాలెంట్ ’ జంటగా టాగ్స్ పెడతారు. అలా ఎందుకు పెట్టాల్సి వస్తుందో అందుకు తగిన కారణాలు చెప్పి బయటకు వస్తుంటారు. అప్పుడు బిగ్ బాస్ ఓ లేఖ పంపి ఎవరు ఎవరికి ఏ టాగ్స్ పెట్టారో వాళ్ళ మెడలోనే ఆ టాగ్స్ వేయమని చెప్తాడు.
వాటిని అందరూ వేసుకున్నాక వాళ్ళు వాటికి తాము కరెక్ట్ కాదని నిరూపించుకోవాలి. ఆ టాగ్స్ కు సంబంధించిన వాళ్ళు తమ టాలెంట్ నిరూపించుకుంటూ ఉండాలి. బిగ్ బాస్ చెప్పినప్పుడల్లా ఇంట్లో వాళ్ళని టెస్ట్ చేస్తూ విసిగిస్తూ ఉండాలి. అదయ్యాక బిగ్ బాస్ అందరికీ ఈ 54 రోజుల జర్నీని టీవీలో వేసి అందరికీ చూపిస్తాడు. అందరూ ఎమోషనల్ గా హ్యాపీ గా వాళ్ళ జర్నీని చూసుకుంటూ ఉంటారు. ఇక ఈరోజు 55వ రోజు. ఇప్పుడు బాల్ బిగ్ బాస్ కోర్టుకు వచ్చేసింది. మనం ఇందాక అనుకన్నట్లు అమ్మ రాజశేఖర్, మెహబూబ్.. వీరిద్దరి మెడపైనా కత్తి వేలాడుతోంది. వేటు ఎవరిపై పడితే వారు ఇంటికి వెళ్లక తప్పదన్న మాట.