ఎమ్మెల్సీ ఎన్నికల కోసం పార్టీలు కొత్త ఎత్తులు వేస్తున్నాయి. ఎన్రోల్ మెంట్ ప్రాసెస్ మొదలుకొని అన్ని రకాలుగానూ ప్రత్యర్థులను కన్ఫ్యూజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అభ్యర్థుల పేర్లను బహిరంగంగా ప్రకటించకపోయినా లీకులను రిలీజ్ చేస్తూ తికమక పెడుతున్నాయి. ఏ పార్టీ ఏ అభ్యర్థిని బరిలోకి దింపుతారో ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు.
ఒక్క వామపక్షాలు మాత్రం తాము ఉమ్మడిగా బలపరిచే అభ్యర్థి పేరును ప్రకటించాయి. మాజీ జర్నలిస్ట్ జయసారథిని బలపరుస్తున్నామని ప్రకటించారు. కోదండరాం, చెరకు సుధాకర్ లు తాము భరిలో నిలవబోతున్నట్టు ప్రకటించాయి. ఇక మిగిలిన ఏ ప్రముఖ పార్టీ ఇప్పటి వరకు తాము ఎవరిని బలపరుస్తున్నామో చెప్పలేదు. ఇంకా అందుకు తగిన సమయం రావాలని చెబుతున్నాయి పార్టీలు.
ఇక బీజేపీ సైతం అనేక మంది పేర్లను పరిశీలిస్తోంది. పార్టీ సీనియర్లు తమకు మద్దతివ్వాలంటూ అదిష్టానం వద్ద అప్లికేషన్లు పెట్టుకుంటున్నారు. అయితే ఎయితే ఎవరిని బలపరచాలన్న దానిపై అదిష్టానం మదిలో మరో పేరు ఉంది. ఆయనే మాజీ మంత్రి , టీడీపీ నుండి పార్టీలో చేరిన మంత్రి పెద్దిరెడ్డి. ఆయన అయితే బలంగా పోటీ ఇవ్వగలరని భావిస్తోంది నాయకత్వం. మంత్రిగా పనిచేసిన అనుభవంతో పాటు ఆయనకు టీడీపీ నుండి వచ్చిన ముఖ్యనేతల సపోర్టుకూడా ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం బీజేపీలోనే ఉన్న మాజీ తెదేపా నేీత గరికపాటి మోహన్‌రావు సైతం పెద్దిరెడ్డికి టికెట్ ఇవ్వాలని గట్టిగా కోరుతున్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా పల్లా రాజేశ్వర్ రెడ్డి లాంటి బలమైన నేతలను ఎదుర్కోవాలంటే అంతే స్థాయిలో పోటీ ఉండాలన్న ఉద్దేశంతోనే పెద్దిరెడ్డిని బలపర్చాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీ బలానికి తోడు అర్థబలం ఉన్న వారిని బలపరిస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండానే ఎన్నికల గండం గట్టెక్కవచ్చుననే యోచనలో ఉంది బీజేపీ ఉందన్నట్లు సమాచారం.
గత ఎన్నికల్లో బలమైన పోటీ ఇచ్చిన బీజేపీ ఈ ఎన్నికల్లో అంత ఈజీగా ఎన్నికలను వదులుకోవద్దని భావిస్తోంది. అందుకే ఎవరిని బలపర్చాలన్న దానిపై ఆచితూచి అడుగులు వేస్తోంది. పెద్దిరెడ్డిని ఎంచుకుంటే గరికపాటి లాంటి వారికి పూర్తి స్థాయిలో బాధ్యతలు అప్పజెప్పడం ద్వారా టీఆర్ఎస్‌లాంటి అధికారంలో ఉన్న బలమైన పార్టీకి దీటుగా సమాధానం చెప్పవచ్చని భావిస్తున్నారు అధ్యక్షుడు బండి సంజయ్. అందుకే పార్టీ సీనియర్ల నుండి ఎంత ఒత్తిడి వచ్చినా వెనక్కు తగ్గకుండా పెద్దిరెడ్డి పేరునే బలపర్చాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇక పార్టీలో ఏళ్ళతరబడి సేవ చేస్తున్న వారికి సర్దిచెప్పడం పెద్ద ఇబ్బంది కాదని.. వారిని బుజ్జగించి పెద్దిరెడ్డికి అనుకూలంగా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని సూచించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి సంజయ్ బుజ్జగింపులకు పార్టీ నేతలు ఒప్పుకుంటారా … లేక మొండి కేసి ఎన్నికల్లో సైలెంట్‌గా ఉండి పోతారా చూడాలి.











