అందాలు ఆరబోయడంలో బెంగాలి ముద్దుగుమ్మలు అందరికన్నా ముందు వరుసలో ఉంటారు. బోల్డ్ నెస్ ప్లస్ హాట్ నెస్ కలగలిసిన ఆ బ్యూటీస్ .. ఆ యాటిట్యూడ్ వల్లనే ఎక్కువగా అవకాశాలు అందుకుంటూ ఉంటారు. అలాంటి ఓ బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ గాళ్ .. నైనా గంగూలి. వర్మ ‘వంగవీటి’తో టాలీవుడ్ లో కథానాయికగా పరిచయం అయింది. మోహన్ రంగా భార్య రత్నకుమారి పాత్రను సమర్ధవంతంగా పోషించింది. ఆ తర్వాత ‘మేరీ బేటీ సన్నిలియోన్ బనాథీహై’ షార్ట్ ఫిల్మ్ తో మంచి పేరు తెచ్చుకుంది. ఇక నైనాకి బాగా పేరు తెచ్చిన సినిమా ఏంటంటే.. మాతృభాషలో నటించిన ‘చరిత్ర హీన్’ అనే వెబ్ సిరీస్. ఇది హిట్టవడంతో సీజన్ 2 , సీజన్ 3 కూడా వచ్చాయి.
ఇక ‘వంగవీటి’ తర్వాత ‘జోహార్’ అనే తెలుగు సినిమాలో నటించిన నైనా.. వర్మ ‘డేంజరస్’ లో అప్సరారాణితో కలిసి లెస్బియన్ గా అత్యంత హాట్ గా ఎలివేట్ కానుంది. దీనికి సంబంధించిన పోస్టర్స్ ఆమెలోని హాట్ నెస్ తీవ్రతను సూచిస్తున్నాయి. ఇక అమ్మడి సోషల్ మీడియా విన్యాసాల గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అక్కడ ఆమెకు ఓ రేంజ్ లో ఫాలోయింగ్ ఉంది. తరచుగా ఆమె పోస్ట్ చేసే హాట్ ఫోటోస్ కు బోలెడంత క్రేజ్.
తాజాగా నైనా గంగూలి పోస్ట్ చేసిన ఓ హాట్ పిక్ .. నెటిజెన్స్ ను నిద్రపట్టనీయడం లేదు. వెనకాల మిర్రర్ పెట్టుకొని .. బ్లాక్ లాంగ్ టాప్ ధరించి.. బోటమ్ ఎలాంటి ఆచ్ఛాదన లేకుండా.. ఆమె చేస్తున్న థై షో ఔరా అనిపిస్తోంది. ఇంతకు ముందు ఇలాంటి చిన్నెలెన్నో చేసినప్పటికీ.. ఇది మాత్రం ఆమెకు ప్రత్యేకం అనిపిస్తోంది. ఈ హాట్ పిక్ కు నెటిజెన్స్ నుంచి బోలెడంత స్పందన లభిస్తోంది. ఈ హాట్ పిక్ లో నైనా అందాలు ఆరబోయడంలో నిజంగా డేంజరస్ గాళ్ అనిపిస్తోంది.