విశాఖపట్నం నగర శివారులో గల సాయి ప్రియ రిసార్ట్స్ లో బుధవారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. 53 తులాల బంగారు ఆభరణాలు మాయం చేసేసారు. ఈ సంఘటనకు సంబంధించి పి పి ఎం పాలెం పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. సాయి ప్రియ రిసార్ట్స్ లో గురువారం మధ్యాహ్నం ఓ పెళ్లి వేడుక కోసం వధూవరులు వారి కుటుంబీకులు బుధవారం సాయంత్రం సాయి ప్రియ రిసార్ట్స్ లో బస చేశారు . నగరంలోని ఒక ఎమ్మార్వో కొడుకు కి అనకాపల్లి మునగపాక మండలం తోటాడ గ్రామం సిరసపల్లి ప్రాంతానికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన అమ్మాయికి పెళ్లి నిశ్చయమైంది. గురువారం ఉదయం 11 గంటలకి రిసార్ట్స్ లో పెళ్లి జరగనుంది. రాత్రి 12 గంటల వరకు పెళ్లి వారంతా మేల్కొని ఉన్నారు. ఒంటి గంట ప్రాంతంలో నిద్ర లో ఉండగా అర్ధరాత్రి రెండున్నర గంటల ప్రాంతంలో 301 రూమ్ నెంబర్ లోగల పెళ్లి కుమార్తె కు చెందిన 53 తులాలు బంగారు ఆభరణాలు గుర్తుతెలియని వ్యక్తులు దొంగలించారు. దీంతో పెళ్లి బృందం లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ చోరీకి పాల్పడింది తెలిసిన వారి పనేనని పోలీసులు భావిస్తున్నారు.
కాకినాడ పోర్టు సాక్షిగా జగన్‌కి విజయసాయి వెన్నుపోటు..??
వైసీపీ రాజ్యసభ సభ్యుడు, ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత వేణుంబాక విజయసాయిరెడ్డి......