ప్రముఖ స్వాతంత్ర సమర యోధులు ’సర్దార్ గౌతు లచ్చన్న‘ గారి విగ్రహం పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన గౌరవ జిల్లా మంత్రివర్యులు సీదిరి అప్పలరాజు వాఖ్య లను ఖండిస్తూ నేడు ఆ మహనీయుని విగ్రహాన్ని సందర్శన నిమిత్తం గురువారం పలాస బయలుదేరారు శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు కింజరాపు రామ్మోహన్నాయుడు, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్, స్థానిక ఎంపీ కార్యాలయం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పోలీస్‌ల చర్యలకు నిరసనగా వారి పలాస పర్యటనకు సంఘీభావంగా జరిగిన కార్యక్రమం నగర, మరియు నియోజకవర్గం టీడీపీ నాయకులు, కింజరాపు, గౌతు అభిమానుల పోరాటఫలితంగా పోలీస్‌లు వారిని పలాస వెళ్ళడానికి అనుమతించారు.
ముందు పోలీస్ వారు అడ్డుకున్న సమయంలో తెదేపా నాయకులు మాట్లాడుతూ, లచ్చన్న గారు దేశ స్వాతంత్య్రం కోసం ఎన్నో త్యాగాలు, పోరాటాలు, జైలు జీవితాన్ని గడిపిన మహానుభావులు అని అన్నారు.
Must Read ;- వైసీపీ VS టీడీపీ.. పలాసలో రగులుతున్న కుల రాజకీయం
ప్రజా హృదయాలలో చిర స్థాయిగా ‘సర్దార్ గౌతు లచ్చన్న గా ఉన్నారని ఆయన పట్ల మంత్రి ఈ విధంగా ప్రవర్తించడం జాతి మొత్తన్ని అవమానించడమే అని అన్నారు. మా తండ్రి దివంగత ఎర్రన్నాయుడు హయాం నుండి ఆయనతోటి టీడీపీ నాయకులు గాని మేము ప్రజాస్వామ్య బద్దం గా ప్రవర్తిస్తూ పోలీసులను గౌరవిస్తామని, అలాగే ఆ మహనీయుని విగ్రహం విషయంలో ప్రజా స్వామ్య బద్దం గా మాట్లాడుతూ పోరాటం చేస్తున్నామని రామ్మోహన్ నాయుడు అన్నారు. పోలీస్‌లు ఈ రోజు ఉదయం నుండి జిల్లాలో టీడీపీ నాయకులను, గౌతు అభిమానులును పలాస విగ్రహ సందర్శన చేయకుండా అడ్డుకోవడం చాలా బాధాకరం అని అన్నారు. ప్రజా ప్రతినిధులమైన మమ్మల్ని ఆపడం మంచి పద్ధతి కాదని మీరు ఇలానే ప్రవర్తిస్తే ఈ విషయం పార్లమెంట్ లో ప్రస్తావిస్తామని మేము ఏమిచేసినా ప్రజాస్వామ్యనికి భంగం వాటిల్లకుండా చేస్తామని ఆయన అన్నారు. ఎట్టి పరిస్థితిలలో పలాస మేము వెళతామని ఇక మీ ఇష్టం అని అన్నారు.
ఈ కార్యక్రమం లో శ్రీకాకుళం నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్, ప్రధాన కార్యదర్శి చిట్టి నాగభూషణం, నాయకులు డాక్టర్ జామి భీమశంకర్, సింతు సుధాకర్, శిల్లా శ్రీనువాసరావు,మామిడి గోవిందరావు, మూకళ్ళ, శ్రీనివాసరావు, నందివాడ గోవిందరావు, గొండు వెంకటరమణ మూర్తి, అరవల రవి, నగర టీడీపీ డివిజన్ ఇంచార్జి లు నాయుడు (బుజ్జి ), మూకళ్ళ,సింహాద్రి నాయుడు, జాక,శ్యాం సుందరావు, గండేపల్లి కోటేశ్వరరావు, బలగ, శివ ప్రసాద్, పట్నాల, పార్వతీశం, కవ్వాడి సుశీల , కరగాన భాస్కరరావు, సురకాశి, వెంకటరావు, మైలపల్లి రాజు, తాళ్లూరి నవీన్,కరగాన రామ్మోహన్ యాదవ్ (రాము ) , సిరిపురం హరి, రోణంకి కళ్యాణ్, జిల్లా టీడీపీ కార్యాలయ మేనేజర్ గొర్లె వెంకటరమణ, నగర టీడీపీ నాయకులు గుత్తు చిన్నారావు, పెద్ది కవిత, మైనార్టీ నాయకులు అబ్దుల్ షాజహాన్ షాను,ముబారక్, నిజాముద్దీన్ , బహుదూర్ బాషా,నగర టీడీపీ యువత షణ్ముఖ, మూగి ధనరాజ్ గార మండల నాయకులు మైలపల్లి నరసింగరావు, ప్రసాద్, అల్లు తారక్, గోవింద, నాయుడు, నగర టీడీపీ క్యాడర్, గార, రూరల్ టీడీపీ మండల నాయకులు పాల్గొన్నారు.
Also Read ;- రగిలిన తా‘ఢి’పత్రి.. జేసీ ఇలాకాలో వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి దాదాగిరి