అల్లు అర్జున్ (బన్నీ).. టాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడు. అర్జున్ టాప్ హీరో మాత్రమే కాదు టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్స్‌లో అల్లు అర్జున్ – స్నేహా రెడ్డి జంట ఒకటి. మార్చి 6, 2011న ఒక్కటైన ఈ జంట ఇప్పటికీ ఎంతో అన్యోన్యనంగా ఉంటారు. బన్నీ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, తన ఫ్యామిలీకి మాత్రం కొంత సమయం పక్కా కేటాయిస్తాడు. తన పిల్లల విషయంలో చాల శ్రద్దగా ఉంటాడు. తన ప్రియసఖి విషయంలో కూడా అంటే శ్రద్దగా ఉంటాడు. తన భార్య అంటే తనకు ఎంతో ప్రేమ అని, తన జీవితం ఇంత ఆనందంగా ఉందంటే దానికి కారణం తన భార్య స్నేహ అని, తనకే కాదు తన కుటుంబానికి కూడా స్నేహ అంటే ఎంతో ఇష్టం అని, ఒక కూతురులా మా ఇంట్లో కలిసిపోయిందని బన్నీ చాల సందర్భాలలో చెప్పుకొచ్చాడు.
ఇకపోతే ఈ రోజు బన్నీ సతీమణి స్నేహా రెడ్డి బర్త్‌డే కావడంతో నిన్న రాత్రే ఆమె పుట్టిన రోజు వేడుక జరిపించారు. కరోనా నేపథ్యంలో కేవలం ఇంటి సభ్యుల మధ్య కేక్ కట్ చేయించి విషెస్ అందించారు. బర్త్‌డే వేడుకకి సంబంధించిన ఫోటోని అల్లు అర్జున్ తన ట్విట్టర్‌లో షేర్ చేస్తూ.. నా జీవిత భాగస్వామికి ఇలాంటి ఆనందమైన రోజులు మళ్ళీ మళ్ళీ రావాలి . నీతో కలిసి ఇంకా ఎన్నెన్నో బర్త్‌డేలు జరుపుకోవాలని ఆశిస్తున్నాను. హ్యాపీ బర్త్ డే క్యూటీ అంటూ బన్నీ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం బన్నీ సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ అభిమానులకు విపరీతంగా నచ్చింది. ఈ చిత్రం షూటింగ్ కోవిడ్ 19 కారణంగా నిలిచిపోయింది. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ మరల పట్టాలెక్కబోతుంది.











