ఒంగోలులో మహిళా వాలంటీర్ సజీవ దహనం సంచలనం రేపింది. దివ్యాంగురాలైన ఉమ్మనేని భువనేశ్వరి ఒంగోలు ఏడోవార్డులో వాలంటీర్ గా చేస్తున్నారు. నిన్న రాత్రి దశరాజుపల్లిరోడ్డులో ఆమె మూడు చక్రాల వాహనంలోనే అగ్నికి ఆహుతి అయింది. ఆమె బ్యాగులో లభించిన ఆధారాల ద్వారా భువనేశ్వరి ఒంగోలు ఏడో వార్డు వాలంటీర్ గా చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.
భువనేశ్వరి మృతిపై తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆమె ఫోన్ నుంచి పంపిన మెసేజీల ఆధారంగా ఇది ఆత్మహత్యగా పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కొందరు నేతల ఒత్తిడి తట్టుకోలేకే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని స్థానికులు అనుమానాలు.
Must Read ;- మైనర్ బాలికపై అఘాయిత్యం.. నిందితున్ని తప్పించే ప్రయత్నాల్లో అధికార పార్టీ..