పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వరంగల్, ఖమ్మం, నల్గొండ తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై కేసు నమోదైంది. పల్లాపై మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ) సభ్యుడు, ఆర్ఐ జీవీఎస్ రమణారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని నల్గొండ టూటౌన్ ఎస్సై నర్సింహులు వివరించారు.
కోడ్ ఉల్లఘించారని..
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఆయన అనుచరులపై నల్లగొండ టూటౌన్ పోలీస్ స్టేషన్లో మంగళవారం రాత్రి కేసు నమోదైంది. టూటౌన్ ఎస్సై డి. నర్సింహులు కథనం ప్రకారం నల్లగొండ కలెక్టరేట్లో నామినేషన్ వేసే సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్లు, ఇతర ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ విషయమై వామపక్షాలు, బీజేపీ నేతలు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మెంబర్ ఈవీఎస్ రమణారావు ఫిర్యాదు మేరకు రాజేశ్వర్‌రెడ్డి, ఆయన అనుచరులపై కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు

ప్రతిపక్షాలవి తప్పుడు ఆరోపణలు..
ప్రతిపక్ష పార్టీలు సీఎం కేసీఆర్ కుటుంబాన్ని అపఖ్యాతి చేయాలనే ఉద్దేశంతో పదేపదే అబద్ధాలు చెబుతున్నాయని, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డిని గెలిపించి ఆ ఆరోపణలను తిప్పికొట్టాలని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, జగదీశ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్ అన్నారు. తెలంగాణ వచ్చిన ఆరేళ్లలో 1.3 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని స్పష్టం చేశారు. రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ రెండువేల ఉద్యోగాలనూ కల్పించలేకపోయిందని మండిపడ్డారు.
Must Read ;- టీఆర్ఎస్ వ్యూహాత్మక జాప్యం.. వైరి పక్షాలకు కేసీఆర్ షాక్











