భారత్‌లో వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం వేగంగా జరుగుతోంది. కేంద్రం వెల్లడించిన లెక్కల ప్రకారం బుధవారం ఉదయం 8 గంటల వరకు 1,21,65,598 మందికి వ్యాక్సిన్‌ను అందించారు. వీరిలో 1,07,67,198 మంది ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు మొదటి డోసు, 13,98,400 మందికి రెండో డోసు అందించామన్నారు. వ్యాక్సిన్ పంపిణీ చేయడంలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. 39వ రోజు వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా 2,79,823 మందికి మొదటి డోసు, 1,40,223 మందికి రెండో డోసును అందించామని అధికారులు వెల్లడించారు.

కరోనా కేసులు..
ఇక కరోనా కేసుల వివరాలు చూస్తే.. 19 రాష్ట్రాలు, కేంద్ర పాలింత పాంత్రాల్లో సున్నా మరణాలు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 5లోపు మరణాలు, రెండు రాష్ట్రాల్లో పదిలోపు, ఒక్క రాష్ట్రంలో ఇరవైలోపు, మరొక రాష్ట్రంలో ఇరవైకి పైగా మరణాలు నమోదైనట్లు ఆరోగ్యశాఖ ప్రకటనను విడుదల చేసింది. గత కొన్ని రోజులుగా దేశంలో కొత్త కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తున్న విషయం. ముఖ్యంగా మహారాష్ట్ర, చత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్, కేరళ రాష్ట్రాలలో కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి కరోనా పరీక్షలు చేయాలని ఆదేశించింది ఢిల్లీ ప్రభుత్వం. ప్రస్తుతం యాక్టివ్ కేసలు 1,46,907. రికవరీ వివరాలు చూస్తే.. 1,07,26,702కు పెరిగింది. రికవరీ రేటు 97.25గా ఉంది. మొత్తంగా దేశంలో కరోనా మరణాల సంఖ్య 1,56,567కు చేరింది. మరణాల రేటు 1.42శాతంగా ఉంది.
60 ఏళ్లు పైబడిన వాళ్లకు వ్యాక్సిన్..
మార్చి 1 నుంచి 60 ఏళ్లు పైబడిన వారికి కరోనా టీకాలు ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించింది. వీరితో పాటు.. దీర్ఘకాలిక వ్యాధులు కలిగి 45 ఏళ్లు దాటిన వారికి కూడా వ్యాక్సిన్ అందజేయాలని నిర్ణయించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. వీరికి వ్యాక్సిన్ అందించడం కోసం పదివేల ప్రభుత్వ కేంద్రాలు వ్యాక్సినేషన్ కోసం సిద్ధం చేయనున్నట్లు తెలిపింది. వీటితోపాటు.. మరో 20 వేల ప్రైవేటు కేంద్రాల్లోనూ వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది.
Must Read ;- దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు..!











