గజపతి రాజుతో పాటు పలువురిపై కేసు నమోదు …!
రామతీర్థం ఆలయ పున:ప్రతిష్టమహోత్సవంలో జరిగిన పరిణామాలపై ఆలయ ఈవో పోలీలకు ఫిర్యాదు చేశారు. శంకుస్థాపన ఏర్పాట్లు వద్ద తమ విధులకు ఆటంకం కలించారని ఈవో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఆలయ అనువంశిక ధర్మకర్తగా అశోక్ గజపతికి ఎలాంటి ప్రోటోకాల్ ఉల్లంఘన జరగలేదని ఫిర్యాదులో ఈవో ప్రసాదరావు చెప్పుకొచ్చారు. అశోక్ గజపతి రాజుతో పాటు మరికొందరిపై పోలీసులు 2 సెక్షన్ల కిందా కేసు నమోదు చేసినట్లు సమాచారం.
రెండు సెక్షన్ల కింద కేసు నమోదు ..!
విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం బోడికొండపై కొలువైన కోదండ రాముని ఆయలం పునర్నిర్మాణానికి జగన్ రెడ్డి ప్రభుత్వం పూనుకుంది. అయితే అనాదిగా ఆలయం బాధ్యత తమ పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారమని అనువంశిక ధర్మకర్త, మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ గజపతి రాజు పేర్కొంటున్న అంశం. ఏ క్రతువైనా పూసపాటి వంశీయుల చేతుల మీదిగా సాగాల్సిందే! అటువంటిది ఆలయం పున: ప్రతిష్టామహో త్సవంలో ప్రొటోకాల్ పాటించలేదు అన్నది గజపతి రాజు ప్రధానంగా చేస్తున్న ఆరోపణ. ఆలయ ధర్మకర్తగా తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని, కనీసం తేదీలు నిర్ణయించే ముందు కూడా తనకు చెప్పలేదని మండిపడ్డారు. మాన్సస్ ట్రస్ట్ ద్వారా నడిచే ఆలయానికి శిలాఫలకం ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు. ఆనవాయితీకి వ్యతిరేకంగా, ప్రజల మనోభావాలకు విరుద్ధంగా ప్రవర్తించడం సరికాదని అశోక్ గజపతి రాజు విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధులకు ఆటకం, ఆస్తి ధ్వంసం, గందరగోళం సృష్టించారన్న ఈవో ఫిర్యాదుతో నెల్లిమర్ల పోలీసులు కేసు నమోదు చేశారు.