విద్యారంగంలో చంద్రబాబు విజన్… దేశంలోనే నెంబర్ వన్..!!
ఒక దేశం అభివృద్ధి చెందాలంటే సహజ వనరులు ఎంత అవసరమో మానవ వనరులు అంతకంటే ముఖ్యం. విద్యావంతులైన, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి ఉంటే ఎలాంటి వనరులు లేకపోయినా ప్రపంచంలో సూపర్ పవర్‌గా ఎదగవచ్చని జపాన్ రుజువు చేసింది. దేశాభివృద్ధిలో ఉన్నత విద్యకున్న ప్రముఖ్యత అలాంటిది. ఈ విషయాన్ని ఎంతో ముందుగానే గుర్తించి.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు ఏర్పాటు చేసిన దార్శనికుడు, విజనరీ టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. 90వ దశకంలో హైదరాబాద్ నగరంలో చంద్రబాబు చొరవతో ఏర్పాటయిన ఉన్నత విద్యా సంస్థలు ఇప్పుడు తెలంగాణ అభివృద్ధికి తమ వంతు సాయం చేస్తున్నాయి. దేశ విద్యా రంగంలో హైదరాబాద్ పేరును తిరుగులేని బ్రాండ్ అంబాసిడర్‌గా మార్చేస్తున్నాయి.. ఈ విద్యా సంస్థల్లో విద్యను అభ్యసించి లేటెస్ట్ టెక్నాలజీ స్కిల్స్ ఉన్న యువత అందుబాటలో ఉండటమే కాదు, న్నో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్‌లో తమ శాఖలను ఏర్పాటు చేసేందుకు ముందుకు రావడానికి ఒక రోడ్ వేని ఏర్పాటు చేశాయి.
టెక్నాలజీ అంతగా అభివృద్ధి చెందని కాలంలో, రెండున్నర దశాబ్దాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయడు, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థను హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. ప్రతిష్టాత్మకమైన కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థ కోసం ఇతర రాష్ట్రాల నుంచి పోటీ ఉన్నా అప్పటి వాజ్‌పేయి ప్రభుత్వాన్ని ఒప్పించి హైదరాబాద్‌లో ట్రిపుల్ ఐటీ క్యాంపస్ ఏర్పాటు చేయడానికి ఏంతో కృషి చేశారు చంద్రబాబు. నేటి టాప్ యూనివర్శిటీలలో ట్రిపుల్ ఐటీకి ఎంతటి ర్యాంకింగ్ ఉందో స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. మల్టీనేషనల్ కంపెనీలు సైతం ట్రిపుల్ ఐటీలో క్యాంపస్ ఇంటర్ వ్యూల కోసం క్యూ కడతాయి.
కేవలం తన విజన్‌ని టెక్నాలజీకే పరిమితం చేయలేదు చంద్రబాబు నాయుడు. ఐఐఎమ్ తరహా బిజినెస్ స్కూల్‌ని ఏర్పాటు చేయాలని కలలు కన్నారు.. దేశంలోని భారీ ప్రైవేటు కంపెనీలు బిజినెస్ స్కూల్ ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్న విషయం తెలుసుకొని.. ఆ ప్రైవేట్ కంపెనీలను కూడా ఒప్పించి ఆ సంస్థను కూడా హైదరాబాద్లోనే ఏర్పాటు చేయించిన ఘనత చంద్రబాబుదే. ఆ సంస్థే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్. బెంగళూరు లేదా ముంబయిలో ఏర్పాటు చేయాలని భావిస్తోన్న ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌ని హైదరాబాద్‌కి రప్పించడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. ఐఎస్‌బీలో చదువుకున్న అనేక మంది విద్యార్ధులు దేశ విదేశాల్లో భారీ ఎంఎన్‌సీ కంపెనీలను నడిపిస్తున్నారు.
విద్యా రంగంలో చంద్రబాబు విజన్‌కి నిలువుటద్దంగా చెప్పే మరో యూనివర్శిటీ నల్సార్. దేశంలోని టాప్ మోస్ట్ , ఉన్నత ప్రమాణాలు, విలువలు కలిగిన న్యాయ నిపుణులను, అడ్వకేట్లను అందించాలనే ఆశయంలో ఏర్పాటు చేసిన యూనివర్శిటీ నల్సార్. రాజ్యాంగ, న్యాయ కోవిదులను తయారు చేయడంలో నల్సార్ యూనివర్శిటీ దేశంలోని టాప్ మోస్ట్, బెస్ట్ యూనివర్శిటీలలో టాప్ 3లో ఒకటిగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.. ఆయన విజన్‌కి దీనిని ఒక బెస్ట్ ఎగ్జాంపుల్‌గా చెబుతారు.
ఉన్నత విద్యా రంగం అభివృద్ధికి చంద్రబాబు చేసిన కృషి ఫలితంగానే నేడు హైదరాబాద్‌లో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో డజన్ల కొద్దీ యూనివర్శిటీలు వచ్చాయి. ఈ యూనివర్శిటీల ద్వారా లక్షల మంది యువతను స్కిల్డ్ వర్కర్స్‌గా నైపుణ్యాలు సంతరించుకొని లక్షలు, కోట్లలో వేతనాలు అందుకొంటున్నారు. మరెంతో మంది సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేసి వేల మందికి ఉపాధి కల్పిస్తున్నారు. దేశాన్ని అన్ని రంగాలలో దూసుకుపోయేలా చేయడంలో ఈ యూనివర్శిటీల పాత్ర ఎంత చెప్పినా తక్కువే.
ఇదే విజన్, ఇదే తపన, ఇదే ఆశయం, పట్టుదల, లక్ష్యాలను చంద్రబాబు విభజిత ఆంధ్రప్రదేశ్‌లోనూ కనబరిచారు. విభజన తర్వాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పారిశ్రమిక రంగంతో పాటు ఉన్నత విద్యలోనూ వెనుకబడి ఉందన్న అక్షరసత్యాన్ని ఆయన ముందుగానే గ్రహించారు. విభజిత రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఎన్నికైన చంద్రబాబు ఉన్నత విద్యారంగం అభివృద్ధిపై దృష్టి పెట్టి అతి తక్కువ కాలంలోనే ప్రతిష్టాత్మకమైన ఎన్నో యూనివర్శీటీలను రాష్ట్రానికి తీసుకువచ్చారు. కేంద్ర ప్రభుత్వ చొరవతో తిరుపతిలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్, తాడేపల్లిగూడెంలో ఎన్‌ఐటీ, మంగళగిరిలో ఎయిమ్స్, విశాఖలో ఐఐఎమ్ వంటి కేంద్ర విద్యా సంస్థలను వడివడిగా అడుగు పెట్టేలా చేశారు.. ఇక, ఆయన ఎంతో చొరవ చూపి పలు ప్రయివేట్ యూనివర్శిటీలను ఏర్పాటు చేసేలా చొరవ తీసుకున్నారు. దేశంలోని ప్రఖ్యాత యూనివర్శిటీలయిన కొన్నింటిని అమరావతిలో అడుగు పెట్టేలా చేశారు. అమరావతిలో విఐటీ, ఎస్‌ఆర్‌ఎమ్ , అమృత వంటి ప్రైవేటు సంస్థలు చంద్రబాబు హయాంలోనే ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టాయి. వాటిని రాష్ట్రానికి తీసుకు రావడంలో బాబు ఎంతో పట్టుదల ఉంది.. వీటితో పాటు రాజధాని ప్రాంతంలో విజ్క్షాన్, కేఎల్ వంటి అనేక స్థానిక సంస్థలు కూడా ప్రైవేటు యూనివర్శీటీలు ఏర్పాటు చేశాయి. వీటితో రాష్ట్రంలో ఉన్నత విద్యారంగం పరుగులు పెడుతోంది.
ఇలా ఒక విజన్, దార్శనికత, ముందు చూపు, పట్టుదల, కృషితో విభిన్న రంగాలలో రాష్ట్రాన్ని పరుగులు పెట్టించేలా చేసిన అరుదయిన నేతలలో చంద్రబాబు ఒకరు. దేశంలో మరో నేతకి సాధ్యం కాని సక్సెస్ ఇది. సినిమా భాషలో చెప్పాలంటే ఇది ఆల్ టైమ్ రికార్డ్. నెహ్రూ తర్వాత ఇలా ఒక విజన్‌తో ఉన్నత విద్యారంగానికి సేవ చేసిన అతికొద్ది మంది నేతలలో ఆయన ఒకరు.. ఒక్క విద్యా రంగంలోనే.. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు లాంటి దార్శనికుడైన నాయకత్వం రాష్ట్రానికి ఎంతో అవసరం.