కేంద్ర హోంమంత్రి అమిత్ షా మిస్ అయ్యారా..? ఎవరికి కనిపించడం లేదా..? అలాంటిదేమీ లేదే అని చెప్తున్నారు బీజేపీ నేతలు. కానీ కాంగ్రెస్ విద్యార్థి సంఘం నాయకులు మాత్రం ‘గతకొన్నిరోజులుగా అమిత్ షా కనిపించడం లేదు’ అంటూ Missing amithsha # హ్యాష్ టాగ్ తో తెగ ట్వీట్స్ చేస్తున్నారు. అక్కడితో ఆగకుండా.. ఢిలీ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎన్ఎస్ యూఐ విద్యార్థి నేతలు. బాధ్యతగా ఉండి ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన అమిత్ షా లాంటి నేతలు ఎందుకు తప్పించుకుతిరుగుతన్నారని మండిపడ్డారు. దేశంలో కరోనా కేసులు పెరుగుతుంటే.. నేతలు ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. అమిత్ షా చివరిసారిగా బెంగాల్ ప్రచారంలో మాత్రమే కనిపించారని ఎన్ఎస్ యూఐ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమిత్ షా మిస్సింగ్ అనే హ్యాష్ టాగ్ గురువారం ట్విట్టర్లో హోరెత్తిపోతుంది.
చుట్టాలు వస్తున్నారు జాగ్రత్త బాబూ!
తెలుగుదేశం పార్టీ ఓడిపోయి మూడేళ్లయ్యింది. టిడిపి మండల కార్యాలయం నుంచి కేంద్ర కార్యాలయం...