కోవిడ్ మహమ్మారి దేశాన్ని గడగడలాడిస్తోంది. పేద, ధనిక బేధం లేకుండా.. అందరినీ సమానంగా పట్టి పీడిస్తోంది. చాలా మందిని బలి తీసుకుంది. ఇంకా ఎంతో మంది దీని బారిన పడుతునే ఉన్నారు. అలాంటి టైమ్ లో కోవిడ్ బాధితుల పాలిట భగవంతుడిలా అవతరించాడు సోనూసూద్. ఫస్ట్ వేవ్ లో ఎందరో వలసకూలీల్ని స్వస్థలాలకు తరలించాడు. మరెందరికో ఆర్థికంగా ఆదుకొని దేవుడయ్యాడు. ఇప్పుడు ఈ సెకండ్ వేవ్ కష్టకాలంలోనూ.. బాధితులకు ఆక్సిజన్ సరఫరా చేస్తూ .. తన వంతు సాయం చేస్తూ ఆదుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో కోవిడ్ పేషెంట్లు ఆక్సిజన్ కోసం పడుతున్న కష్టాలను తీర్చేందుకు రియల్ హీరో సోనూసూద్ .. మరో కీలక నిర్ణయం తీసుకున్నారు . O2 సిలిండర్ల సరఫరా మాత్రమే కాకుండా ఏకంగా రాష్ట్రాల్లో ఆక్సిజన్ ప్లాంట్లు నెలకొల్పాలని డిసైడ్ అయ్యారు. ఇందుకోసం సామగ్రిని ఫ్రాన్స్ సహా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. మరో 10-12 రోజుల్లో కరోనా ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో .. ప్లాంట్లు ఏర్పాటు చేస్తానని అంటున్నారు. హ్యాట్సాఫ్ టు రియల్ హీరో..