వైజాగ్ స్టీల్ ప్లాంట్ నష్టాలకు కేంద్ర ప్రభుత్వమే కారణమని , నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశాన్ని అమ్మకానికి పెడుతోందని సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్ సేన్ విమర్శించారు. విశాఖ ఉక్కు కోసం ఆంధ్రా ప్రజలు పోరాడుతుంటే ప్రవేటీకరణ చేసేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందని ఆయన ఆరోపించారు. సీఐటీయూ, ఏఐకేఎస్, ఏఐఏడబ్ల్యూయూ నేతలతో కలిసి ఆయన ఢిల్లీలోని ఆంధ్రాభవన్‌లో మీడియాతో మాట్లాడారు. గతంలో కూడ ప్రవేటీకరించాలని చూస్తే అడ్డుకున్నామని, అన్ని సెంట్రల్ ట్రేడ్ యూనియన్లు వైజాగ్ వెళ్లి విశాఖ స్టీల్ పరిరక్షణకు పోరాడతామన్నారు. ప్రత్యేక గనులు లేక పోవడమే విశాఖ స్టీల్ నష్టాలకు కారణమని, ప్రత్యేక గనులు కేటాయించి ప్లాంట్‌కు లాభాలు వచ్చేలా చూడాల్సిన బాధ్యత కేంద్రానిదే అని అన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమంలో తాము భాగస్వాములవుతామని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి వెంకట్ తెలిపారు.
Must Read ;- విశాఖ స్టీల్‌లో రాష్ట్రానికి వాటానే లేదట.. వైసీపీ ఆడేదంతా నాటకమేనా











