యాక్షన్ హీరో విశాల్ మరో మంచి విజయం కోసం ఎదురుచూస్తున్నాడు. యాక్షన్ సన్నివేశాలలో అతను ఎంతగా రెచ్చిపోతాడో ప్రత్యేకించి చప్పనక్కరలేదు. ఈ కోవలోనే వస్తున్న అతని తాజా సినిమా ‘చక్ర’. ఈ సినిమా ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. అలాగే దీని ఒరిజినల్ సౌండ్ ట్రక్ ను చిత్ర యూనిట్ ఇటీవల విడుదల చేసింది. యువన్ శంకర్ రాజా సంగీత సారథ్యంలోని ఈ ట్రాక్ కు మంచి స్పందన లభిస్తోంది.
చక్ర కథేంటి: డిజిటల్ క్రైమ్ నేపథ్యంతో తెరకెక్కిన కథ ఇది. బ్యాంక్ దోపిడీలతో కథ సాగుతుంది. మిలటరీ వాళ్లకి ఇచ్చే అత్యున్నత మెడల్స్ లో ప్రధానమైన చక్ర మెడల్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది.
ట్రైలర్ ఎలా ఉంది?
సినిమా ఎలా ఉంటుందో ట్రైలర్ లోనే చూపెట్టాడు విశాల్. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలే ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ అని ట్రైలర్ చూస్తేనే అర్దమవుతుంది. లిప్ మూమెంట్ సింక్ అయ్యేలా జాగ్రత్త పడ్డారు. డబ్బింగ్ సినిమా అనే భావన రాకూడదన్నది వారి భావన కావచ్చు. ట్రైలర్ తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడంలోనూ విడుదల చేశారు.
తారాగణం : విశాల్, శ్రద్దా శ్రీనాథ్, రెజీనా కసాండ్ర, మనోబాలా, రోబో శంకర్, కెఆర్ విజయ్, సృష్టిడాంగే తదితరులు. సినిమాటోగ్రఫి : బాలసుబ్రమణియం, సంగీతం: యువన్ శంకర్ రాజా, నిర్మాత: విశాల్, రచన- దర్శకత్వం: ఎం.ఎస్. ఆనందన్.