చిత్తూరు పర్యటనకు వెళ్లిన చంద్రబాబును పోలీసులు రేణిగుంట ఎయిర్ పోర్టులో నిర్బంధించడంతో ఆరు గంటలుగా ఆయన నేలపైనే కూర్చుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగంటలుగా కనీసం నీరు, ఆహారం ఏమి తీసుకోకుండా ఆయన నిరాహార దీక్ష చేస్తున్నారు. దీంతో రేణిగుంట ఎయిర్ పోర్టు వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరో వైపు ఆయన్ను హైదరాబాద్ పంపేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. కనీసం మీడియాతో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై అర్బన్ ఎస్పీ ఇతర అధికారులు చంద్రబాబుతో చర్చలు జరుపుతున్నారు.
వైసీపీలో ముసలం.. ప్రజల్లో తిరుగుబాటు
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి స్వీప్-ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలోనూ టిడిపి ఘనవిజయం. ఎప్పుడెప్పుడు...