‘క్రాక్, నాంది’ సినిమాల్లోని తన అసాధారణ నటనతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది వరలక్ష్మీ శరత్ కుమార్. అయితే ‘క్రాక్’ లో విలన్ గా నటించిన వరూ.. ‘నాంది’లో మాత్రం పాజిటివ్ కేరక్టర్ తో ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు మరోసారి ఈ చిన్నది తనలోని నెగిటివ్ కోణాన్ని వెలికితీయబోతోందని సమాచారం. అది కూడా బన్నీ సినిమాలో. కొరటాల దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించబోయే సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ మరోసారి తన విలనిజంతో కట్టిపడేయనుందని సమాచారం.
ప్రస్తుతం చిరంజీవితో ఆచార్య సినిమా తెరకెక్కించే పనిలో ఫుల్ బిజీగా ఉన్నాడు కొరటాల. అలాగే.. పుష్పతో బన్నీతో కూడా బిజీనే. ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత బన్నీ, కొరటాల సినిమా సెట్స్ మీదకు వెళ్ళబోతోంది. పొలిటిక్ థ్రిల్లర్ గా రూపొందనున్న ఈ మూవీలో బన్నీ స్టూడెంట్ లీడర్ గా నటిస్తుండగా.. వరలక్ష్మీ బన్నీని ఢీకొట్టే ప్రత్యర్ధిగా కనిపిస్తుందట. సో.. ఈ లెక్కన వచ్చే ఏడాది వరూ మరోసారి విలన్ గా తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించనుందన్నమాట.