జూనియర్ ఎన్టీఆర్, తెలుగు దేశం పార్టీ మధ్య సుహృద్భావ వాతావరణమే ఉందని ఈ ట్వీట్లు చూస్తేనే అర్థమవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ తనకు కోవిట్ పాజిటివ్ వచ్చిందని ట్వీట్ చేయగానే తెలుగు దేశం పార్టీ అధిష్ఠానం స్పందించింది. ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పందించి ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు. నారా లోకేష్ కూడా తనదైన రీతిలో స్పందించారు. ఎన్టీఆర్ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, పూర్తి కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు లోకేష్ ట్వీట్ చేశారు.
ఇలా తండ్రీకొడుకులు ఎన్టీఆర్ ఆరోగ్యం పట్ల స్పందించి ట్వీట్లు చేయడంవారి మధ్య సుహృద్భావ వాతావరణమే ఉందన్న అభిప్రాయాన్ని కలిగించింది. గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ‘మీరు కరోనా బారిన పడడం బాధాకరం. మీరు తొందరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను’ అన్నారు. ఎన్టీఆర్ తో సన్నిహితంగా మెలిగిన అభిమానులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.
I wish @tarak9999 speedy and full recovery. Take care and get well soon!! https://t.co/HwMlzhp7zr
— N Chandrababu Naidu (@ncbn) May 10, 2021
Praying for your speedy recovery @tarak9999. Please take care of yourself and your family! https://t.co/wBKy1SB9qD
— Lokesh Nara (@naralokesh) May 10, 2021











