వరుస విపత్తులతో నష్టపోయిన రైతులకు ధాన్యం బకాయిలు సకాలంలో చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ఈ మేరకు రైతుల సమస్యలపై సీఎం జగన్ కు లేఖ రాశారు. పంట భీమా, ధాన్యం కొనుగోలు, మద్దతు ధరకు పంట కొనుగోలు చేయడంలో ఘోరంగా విఫలమయ్యారని ఆరోపించారు. టీడీపీ హాయంలో ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమా చేశామని లేఖలో గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ధాన్యం కొనుగోలు చేసి రెండు నెలలు దాటుతున్నా.. ఉలుకూ పలుకూ లేదని మండిపడ్డారు.
రైతులకు చెల్లించాల్సిన బకాయిలు ఇప్పటికే 4 వేల కోట్ల పైనే ఉన్నాయని, ఒక్క గోదావరి జిల్లాల్లోనే రూ.2500 కోట్ల బకాయిలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రకటించిన ధరకు, ప్రైవేట్ వ్యాపారులకు పొంతన లేదని, దీంతో రైతులకు పెట్టుబడులు కూడా రావడం లేదని అన్నారు. ఏపీలో 16 లక్షలపైగా కౌలు రైతులు ఉన్నారని, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఎలాంటి సాయం అందడం లేదని ఆగ్రహ వ్యక్తం చేశారు. రైతుల పండిస్తున్న పంటలకు ప్రభుత్వమే కొనుగోలు చేసి, మద్దతు ధర చెల్లించాలని చంద్రబాబునాయుడు లేఖలో కోరారు.
must read ;- మాన్సాస్‌పై వైసీపీ నేతల కొత్త పల్లవి.. ఆడిటింగ్ అస్త్రం తెరపైకి













