మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ ఆచార్య. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇందులో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుంది. ఇటీవల చిరు, కాజల్ అగర్వాల్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఇదిలా ఉంటే.. ఈ క్రేజీ మూవీలో చరణ్ పాత్ర గురించి ఇంట్రస్టింగ్ అప్ డేట్ బయటకు వచ్చింది. అది ఏంటంటే.. ముందుగా ఆచార్య సినిమాలో చరణ్ గెస్ట్ రోల్ చేస్తున్నారన్నారు.
ఆతర్వాత చరణ్ పాత్ర గెస్ట్ రోల్ కాదు. చరణ్ పాత్ర నిడివి దాదాపు 30 నిమిషాలు ఉంటుందన్నారు. ఇప్పుడు కొరటాల శివ చరణ్ పాత్ర నిడివిని డబుల్ చేసారట. అంటే చరణ్ పాత్ర గంట సేపు ఉంటుందట. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి ఆచార్య పై అంచనాలు రెట్టింపు అయ్యాయని చెప్పచ్చు. ఈ నెలలోనే చరణ్ ఆచార్య షూటింగ్ లో జాయిన్ అవుతారు అని సమాచారం. ఆతర్వాత ఫిబ్రవరి, మార్చి నెలలో జరిగే షెడ్యూల్ తో షూటింగ్ పూర్తవుతుంది.
మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను.. ఇలా వరుస విజయాలతో దూసుకెళుతున్న కొరటాల శివ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తుండడంతో ఖచ్చితంగా ఆచార్య సక్సస్ అవుతుందని అందరూ గట్టి నమ్మకంతో ఉన్నారు. మరి.. మే 9న రానున్న ఆచార్య బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.











