రకుల్.. సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ అనడంలో సందేహం లేదు. ‘లౌక్యం, కిక్ – 2, పండగ చేస్కో, కరెంట్ తీగ, బ్రూస్ లీ, సరైనోడు, ధృవ, నాన్నకు ప్రేమతో, జయ జానకీ నాయకా, విన్నర్, రారండోయ్ వేడుక చూద్దాం, స్పైడర్’ లాంటి సూపర్ హిట్ చిత్రాలతో తన స్టార్ డమ్ ను పెంచుకుంది. రకుల్ ప్రస్తుతం ‘చెక్’ చిత్రంలో నటిస్తోంది. ఆమెకు జోడిగా యువ హీరో నితిన్ నటిస్తున్నారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు చంద్రశేఖర్ ఏలేటి దర్శకుడు.
ఇవాళ రకుల్ ప్రీత్ సింగ్ పుట్టిన రోజు కావడంతో అనేకమంది సినీ పరిశ్రమ ప్రముఖులు ఆమెకు బర్త్ డే విషెస్ చెప్పారు. తాజాగా ‘చెక్’ చిత్ర బృందం కూడా రకుల్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆమె ఎప్పుడు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు వారు తెలిపారు. ఇక రకుల్ అభిమానులు సోషల్ మీడియా వేదిక ద్వారా ఆమెకు బర్త్ డే విషెస్ చెప్తున్నారు. తమ అభిమాన హీరోయిన్ లైఫ్ లో మరెన్నో విజయాలు అందుకోవాలని వారు ఆకాంక్షించారు.
Wishing our lead actress, the gorgeous @Rakulpreet a very Happy Birthday -Team #Check.#HBDRakulPreet pic.twitter.com/YJVIVdADMM
— Bhavya Creations (@BhavyaCreations) October 10, 2020