కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ .. ఇటీవల ‘కర్ణన్’ అనే సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇప్పుడు అతడి తాజా చిత్రం ‘జగమే తంతిరం’ మీదే ఉంది అభిమానుల దృష్టి. కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం గ్యాంగ్ స్టర్ మూవీ కావడంతో మరింత ఆసక్తి నెలకొంది. అయితే ఈ సినిమాను థియేటర్స్ లో విడుదల చేయాలనుకున్నమేకర్స్ .. కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ఓటీటీని ఆశ్రయిస్తున్నారు. నెట్ ఫ్లిక్స్ లో జూన్ 18న ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.
ఈ నేపథ్యంలో ‘జగమే తంతిరం’ మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తమిళనాడుకు చెందిన సురులి అనే నొటోరియస్ గ్యాంగ్ స్టర్ గా ధనుష్ రివీల్ అయ్యాడు. లండన్ లో ని అక్రమఆయుధాలు, బంగారు వ్యాపారానికి సురులిని నియమించుకుంటాడు అక్కడి పొలిటికల్ లీడర్ ఒకరు. దాంతో విదేశాలకు వెళ్ళిన సురలి అక్కడి గ్యాంగ్ స్టర్స్ తో ఎలాంటి వైరం పెట్టుకుంటాడు అనేదే కథాంశం. ఇందులో ధనుష్ డిఫరెంట్ మేకోర్ తో ఆకట్టుకుంటున్నాడు.
ఐశ్వర్యాలక్ష్మి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో ఇంకా.. జేమ్స్ కాస్కో, కలైయరసన్, మలయాళ నటుడు జోజు జార్జ్ (జోసెఫ్ ఫేమ్ ) ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. వైనాట్ స్టూడియోస్ బ్యానర్ పై యస్.శశికాంత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నఈ సినిమా ‘జగమే తంత్రం’ పేరుతో తెలుగులోనూ విడుదల కానుంది. మరి ఈ సినిమా ధనుష్ ఏ రేంజ్ లో పేరు తెస్తుందో చూడాలి.
Must Read ;- ‘కర్ణన్’ తెలుగు వెర్షన్ .. ప్రధాన పాత్రలో రావు రమేశ్ ?