బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్, కియారా అద్వానీ నటించిన కామెడీ హారర్ థ్రిల్లర్ ‘లక్ష్మీ బాంబ్’. తమిళ సూపర్ హిట్ మూవీ కాంచన కి రీమేక్ వెర్షన్ . దీనికి కూడా రాఘవ లారెన్సే దర్శకుడు అన్న సంగతి తెలిసిందే. అక్షయ్ కుమార్ ఇమేజ్ ను దృష్ణిలో పెట్టుకొని ఒరిజినల్ వెర్షన్ కు మరిన్ని బెటర్ మెంట్స్ చేసిన ఈ సినిమా ట్రైలర్ నిన్ననే విడుదలైంది. అందరినీ నవ్విస్తూనే భయపెట్టిన ఈ ట్రైలర్ కి రికార్డ్ స్థాయిలో వ్యూస్ వచ్చాయి. 24గంటల్లో ఏకంగా 70మిలియన్స్ మంది వీక్షించడం అందరినీ ఆశ్యర్యపరుస్తోంది.
‘లక్ష్మీ బాంబ్’ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 9న… డిస్నీ హాట్ స్టార్ ఓటీటీలో విడుదల కానుంది. నిజానికి ఈ సినిమాకి సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. సుశాంత్ పై న్యాయపోరాటానికి అక్షయ్ కుమార్ ఎలాంటి సపోర్ట్ అందించకపోవడంతో.. సుశాంత్ అభిమానులు బోయ్ కాట్ లక్మీ బాంబ్ అంటూ హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తూ విరుచుకుపడ్డారు.
అంతేకాదు ఈ వారంలో అక్షయ్ విడుదల చేసిన ఒక ఎమోషనల్ వీడియోను వారు ప్రమోషనల్ స్టంట్ అంటూ విమర్శించారు. ఈ నేపథ్యంలో దీని ప్రభావం లక్ష్మీ బాంబ్ ట్రైలర్ మీద పడుతుందేమోనని డీస్నీ వారు సందేహపడ్డారు. అయితే .. అవేమీ ఈ ట్రైలర్ మీద ఎలాంటి ప్రభావం చూపించలేకపోయాయని రికార్డ్ వ్యూస్ తో తేలిపోయింది. మరి సినిమా ఓటీటీలో ఏ రేంజ్ లో పేలుతుందో చూడాలి.
Thank you everyone for showing so much love to #LaxmmiBombTrailer ❤️ and making it the most viewed trailer in India in 24 Hours#YehDiwaliLaxmmiBombWali 💥 #FoxStarStudios #DisneyPlusHotstarMultiplex@akshaykumar @advani_kiara @offl_Lawrence @Shabinaa_Ent @tusshkapoor pic.twitter.com/z1uzc9P0yD
— Disney+ Hotstar VIP (@DisneyplusHSVIP) October 10, 2020











