వివేకా హ*త్య కేసులో కీలక సాక్షి వాచ్ మెన్ రంగయ్యది హ*త్యా.?? సహజ మర*ణమా..?? ఆయనని చం*పేశారా.?? చని*పోయారా?? ఈ ప్రశ్నలే ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో చర్చనీయాంశంగా మారుతోంది.. ఆయనది హ*త్య వెనక అనుమానాలున్నాయని, ఇది ముమ్మాటికి హ*త్య అయి ఉండవచ్చని బాంబ్ పేల్చారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. వైఎస్ వివేకా హ*త్య కేసులో కీలక సాక్షులు వరసగా మృ*తి చెందుతున్నారు.. వాచ్ మెన్ రంగయ్యది నాలుగో మర*ణం.. తక్కువ సమయంలోనే వరసగా సాక్షులు అనుమానాస్పందంగా మర*ణించడం ఏపీలో దుమారం రేపుతోంది.. తాజాగా దీనిపై ముఖ్యమంత్రి సైతం అనుమానం వ్యక్తం చేయడంతో ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి..
రంగయ్య మృ*తిపై ఏపీ కేబినెట్‌లో చర్చ జరిగింది.. ఈ అంశంపై కేబినెట్‌లోని కొందరు మంత్రులు మాట్లాడుతూ.. నిజంగానే రంగన్నది సహజమర*ణం కాకపోతే, ఆయన మృ*తిని పోలీసులకు ఆపాదించడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు.. వాచ్ మెన్ మృ*తి అనుమానాస్పదమే అని డీజీపీ ఇప్పటికే మంత్రులకి వివరించారు. పోలీసులు సైతం అనుమానాలు వ్యక్తం చేశారని తెలిపారు డీజీపీ.. ఈ అంశాన్ని ప్రస్తావించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. జగన్ కదలికలను ఎప్పటికి అప్పుడు గమనించాలని, ఆయన చేయబోయే కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.. పరిటాల రవి కేసులోనూ సాక్షులు వరసగా మర*ణించారని, ఆ కేసునూ ప్రస్తావించారు చంద్రబాబు..
అంతేకాదు, జగన్ సొంత బాబాయ్ వివేకానంద మర*ణాన్ని గుండెపోటు అని, గొడ్డలి వేటు అని తర్వాత తనని టార్గెట్ చేస్తూ సాక్షి మీడియాలో వచ్చిన కథనాలను మంత్రులకు గుర్తు చేశారు ఏపీ ముఖ్యమంత్రి.. ప్రతిపక్షంలో ఉంటే దర్యాప్తు కోరి, అధికారంలోకి వచ్చాక సొంత చెల్లెలు, వివేకా కూతురునే నిందించేలా ఆరోపణలు చేయించిన ఘనుడు జగన్ అని తెలిపారు చంద్రబాబు.. రాజకీయాలను క్రిమినలైజేషన్ చేసిన జగన్ లాంటి నేర స్వభావం కలిగిన వారిపై దృష్టి పెట్టి ఉంచాలని మంత్రులకు, అధికారులకు సూచించారు చంద్రబాబు..
వివేకా మృ*తిలో కీలక సాక్షి వాచ్ మెన్ రంగయ్యపై తాజాగా ముఖ్యమంత్రి చేసిన అనుమానాస్పద వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.. దీనిపై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు.. ఎప్పుడు ఎలాంటి బ్రేకింగ్ వస్తుందో చూడాలి..