ఏపీ ప్రభుత్వంపై బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురందరేశ్వరి మాట్లాడుతూ రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఏంటని ప్రజలను అడిగితే తెలుస్తుందన్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్, చంద్రబాబుతో తలనొప్పితో ఉన్న వైసీపీకి ఇప్పుడు పురందేశ్వరి టెన్షన్ పట్టుకుంది వైసీపీ సీఎం జగన్ కి..
కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి గురువారం బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో బీజేపీ మాజీ అధ్యక్షులు సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి తదితరులతో ఆమె సమావేశమయ్యారు. నేతల సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె.. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు
హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకున్న పురందేశ్వరి అక్కడ తన తండ్రి దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్. టి.రామారావుకు నివాళులర్పించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ సమాధి వద్ద ఆమె కన్నీరుమున్నీరుగా విలపించారు. రాష్ట్రంలో బీజేపీపై దుష్ప్రచారం జరుగుతోందని ఆరోపించారు. జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై విరుచుకుపడిన ఆమె, రాష్ట్రానికి కేంద్రం ఇస్తున్న మద్దతుకు సంబంధించిన వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని కోరారు.
కేంద్రం అనేక పథకాలకు సాయం అందిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆ పథకాలను తమవే అని వైసీపీ నాయకులూ సొంత డబ్బా కొట్టుకుంటున్నారు. రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద రూ.6,000 అందజేస్తున్నారని, అయితే ఈ డబ్బును రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద డీబీటీగా అందజేస్తున్నట్లు తెలిపారు. రైతులకు పెట్టుబడి సాయంగా రూ.12,500 ఇస్తామన్న జగన్ హామీ ఏమైందని ప్రశ్నించారు బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి..
తొమ్మిదేళ్లలో ఇళ్ల నిర్మాణానికి కేంద్రం రూ.20 వేల కోట్లు రాష్ట్రానికి ఇచ్చిందని పురందేశ్వరి తెలిపారు. ఇప్పటికి 65 శాతం ఇళ్లు పూర్తి కావాల్సి ఉండగా 35 శాతం పనులు పూర్తి కాలేదు. పేదల పట్ల వైఎస్‌ఆర్‌సీపీ స్పందన ఏంటని ప్రశ్నిస్తూ కేంద్రం ఇస్తున్న వివిధ పథకాలు ఎక్కడికి పోయాయో జగన్ ప్రభుత్వం చెప్పాలని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం జాప్యం చేస్తోందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం పనులు పూర్తి చేయలేకపోతే కేంద్రానికే వదిలేయాలని పురందేశ్వరి అన్నారు.. పురందేశ్వరి అట్టాక్ని గ్రహించలేని వైసీపీ అధిష్టానం ఎలా సమాధానం ఇవ్వాలో తెలియక సతమతవుతున్నారని సమాచారం.