ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డేటా సెంటర్లు క్యూ కడుతున్నాయి. విశాఖలో ఇప్పటికే 3.5 గిగావాట్ల సామర్ధ్యంతో డేటా సెంటర్లు ఏర్పాటు చేయడానికి గూగుల్, మెటా, రిలయన్స్ వంటి సంస్థలు ఎంఓయూలు కుదుర్చుకొన్నాయి. అయితే ప్రస్తుతం ఇండియాలో మొత్తం డేటా సెంటర్ల కెపాసిటీ ఎంతో తెలుసా.. 1.5 గిగావాట్లు. అంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని డేటా సెంటర్ల సామర్ధ్యం కంటే ఏపీలో రాబోయే డేటా సెంటర్ల కెపాసిటీ రెండున్నర రెట్లు ఎక్కువ. ఇంత భారీ స్థాయిలో కొత్త డేటా సెంటర్లు రావడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం విపరీతంగా పెరగడం.. రెండోది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన డేటా ప్రొటెక్షన్ చట్టం. అయితే ఏపీకే ఈ ప్రాజెక్టులు రావడానికి వెనుక సీఎం చంద్రబాబు విజన్ ఉంది.
ఏఐ బూమ్, 5జీ ఇంటర్నెట్ వినియోగం వల్ల మన దేశంలో డేటా వాడకం భారీగా పెరిగింది. ఓటీటీలు, సోషల్ మీడియాలో కంటెంట్ వినియోగమూ ఎక్కువైంది. ఈ డేటాలో చాలా వరకు ప్రస్తుతం ఇతర దేశాల్లో స్టోర్ చేస్తున్నారు. భారతీయుల డేటా భారతదేశంలోనే ఉండాలని కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది. దీంతో అంతర్జాతీయ ఐటీ దిగ్గజాలు ఇండియాలో డేటా సెంటర్లు ఏర్పాటు చేయడం తప్పనిసరిగా మారింది. ఇవన్నీ ఇప్పుడు మనకు తెలుస్తున్నాయి. కానీ ఏపీ సీఎం చంద్రబాబు.. డేటా సెంటర్ల బూమ్‌ని ఎప్పుడో గుర్తించారు. 2018లోనే ఆదానీ డేటా సెంటర్‌ని విశాఖ తీసుకొచ్చారు. తర్వాత ప్రభుత్వం మారడంతో అది ఆగిపోవడం వేరే విషయం అనుకోండి.
2035 నాటికి ఇండియాలో డేటా సెంటర్ల సామర్ధ్యం 14 గిగావాట్లకు చేరుతుందని ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఇందులో 6 గిగావాట్ల డేటా సెంటర్లను ఏపీలో ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వం టార్గెట్ పెట్టుకొంది. అంటే ప్రస్తుతం ఉన్న సామర్ధ్యం కాకుండా.. రాబోయే పదేళ్లలో దేశం మొత్తం కెపాసిటీలో సగం సామర్ధ్యం కలిగిన డేటా సెంటర్లు ఏపీకి రాబోతున్నాయి. అది చంద్రబాబు విజన్. పన్ను రాయితీలు కల్పించి.. విధానపరమైన అడ్డంకులను తొలగించడం ద్వారా గూగుల్ డేటా సెంటర్‌ను విశాఖలో ల్యాండ్ చేయడంతో.. ఇతర కంపెనీలు అదే బాటపట్టాయి. అంటే వైజాగ్ త్వరలో దేశానికే కాదు.. ప్రపంచానికే డేటా క్యాపిటల్‌గా మారనుందన్న మాట.











