రాజద్రోహం కేసులో సస్పెండ్ అయిన జడ్జి రామకృష్ణకు ఏపీ హైకోర్టు బెయిలు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. షరతులతో కూడిన బెయిల్ ఇవ్వడంతో గురువారం చిత్తూరు జిల్లా పీలేరు సబ్ జైలు నుంచి జడ్జి రామకృష్ణ విడుదలయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్ పై ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలపై పోలీసులు రామకృష్ణను అరెస్ట్ చేశారు. చిత్తూరు జిల్లా పీలేరుకు చెందిన జయరామచంద్రయ్య అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు జడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఐపీసీ సెక్షన్ 124ఏ కింద పీలేరు పోలీసులు దేశద్రోహం కేసు నమోదుచేశారు. దీంతో జడ్జి హైకోర్టును ఆశ్రయించారు. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో ఆయన ఇవాళ రిలీజ్ అయ్యారు.
Must Read ;- సస్పెండైన జడ్జి రామకృష్ణకు బెయిల్ మంజూరు











