మూడురోజులు పాటు ఢిల్లీ పర్యటన..!
తెలంగాణ సీఎం కేసీఆర్ ఫ్రంట్ ఏర్పాటుకు దేశంలోని బీజేపేతర సీఎంలందర్ని కలుస్తున్నారు. తమిళనాడు, మహారాష్ట్ర సీఎంలతో ఇప్పటికే భేటీకాగా.. కర్నాటక ప్రతిపక్షనేత, మాజీ ప్రధాని దేవెగౌడను కేసీఆర్ ఫోన్ లో మాట్లాడారు. ఢిల్లీ కోటను బద్ధలు కొడతాం అన్న సీఎం కేసీఆర్ పిలుపు మేరకు దేశంలోని బీజేపేతర రాష్ట్రాల సీఎంలు స్పందించారు. అలానే వారి సంపూర్ణ మద్దతును ప్రకటించారు. దీనిలో భాగంగానే మొన్న మహారాష్ట్రలో కేసీఆర్ పర్యటించారు. అక్కడ సీఎం ఉద్ధవ్, ఎన్సీపీ నేత శరద్ పవర్ లను కలిశారు. ఫ్రంట్ ఏర్పాటు విషయంలో స్పష్టతకోసం అందరి మద్దతు కావాలని కేసీఆర్ కోరుతున్నారు. ఈ నేపధ్యంలోనే కేసీఆర్ ఢిల్లీలో మూడు రోజులు పాటు పర్యటించేందుకు షెడ్యూల్ ఖరారు చేసుకున్నారు.
కేసీఆర్ ఢిల్లీ టూర్ షెడ్యూల్ ఇదే
నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం కేసీఆర్ పలు ప్రాంతీయ పార్టీల మద్దతును కోరుతున్నారు. అందులో భాగంగా కేసీఆర్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో భేటీ కానున్నారు. ‘‘బీజేపీ ముక్త్ భారత్’’ అంటూ నినదించిన సీఎం కేసీఆర్ జాతీయ స్థాయిలో వేదిక ఏర్పాటుకు సిద్ధమయ్యారు. ప్రధాని మోదీ వ్యతిరేక కూటమి కట్టే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలతో జతకట్టేందుకు పశ్చిమ బెంగాల్ మమత నేతృత్వంలో కేసీఆర్ దేశంలోని అన్ని రాష్ట్రాలలో పర్యటించి, మద్దతును కూడగట్టుకుంటున్నారు.











