విశాఖ రాజధాని అని ఉత్తరాంధ్ర ప్రజలను మభ్యపెట్టారు
ఏపీ రాజధాని ఏది అంటే.. సరైన సమాధానం నేటికి జగన్ రెడ్డి ప్రభుత్వం చెప్పకోలేని పరిస్థితి. అలానే అమరావతి రాజధానిని ఓప్పుకోలేదని దుస్థితి కూడా! వైసీపీ ప్రభుత్వం ప్రకటించిన విశాఖలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని నారా లోకేష్ నిలదీశారు. ఫ్యాక్షన్ మూలాలు ఉన్న జగన్ రెడ్డి రాష్ట్రంలో వ్యాపారం తానే చేయాలని భావిస్తూ.. మిగతా వ్యాపారులను వేధిస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ పై పడ్డ జగన్.. ఇండియాలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా షరతులు పెట్టారని విమర్శిచారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాతే విశాఖ నుంచి హెచ్.ఎస్.బీ వెళ్లిందని, రూ. లక్షల కోట్లు పెట్టుబడి పెడతామని వచ్చిన అదానీ డేటా సెంటర్ ముంబైకి వెళ్లిపోయిందని లోకేష్ గుర్తు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం హయంలో 5.4 లక్షల ఉద్యోగాలు కల్పన జరిగిందని గౌతం రెడ్డి చెప్పారని.. మరి వైసీపీ హయంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని లోకేష్ ప్రశ్నించారు.
వివేకా ను ఎవరు చంపారు?
జగన్ సొంత బాబాయ్ వివేకా హత్య పై జగన్ ఎందుకు స్పందించడం లేదని లోకేష్ ప్రశ్నించారు. వివేకా హత్య నిందుతులను కనిపెట్టడంలో జగన్ ఎందుకు ఉత్సాహం కనపరచడంలేదని ఆయన విమర్శించారు. వివేకా హత్యకు సూత్రదారులు వాళ్ళే అంటూ సంచలన ఆరోపణలు చేశారు. వివేక హత్య వెనుక ఎవరున్నారో ఆయన కుమార్తె సునీతా రెడ్డి స్పష్టం చేశారని అయినా జగన్ స్పందించడం లేదని అన్నారు. వివేకా గుండెపోటుతో మరణించారని చెప్పిన అవినాష్ రెడ్డే.. హత్య చేయించారన్న విషయం అందరికి తెలిసిపోయిందని.. అటువంటి అవినాష్ రెడ్డి జైలుకెళ్ళకుండా ఇప్పుడు రోడ్లపై తిరుగుతున్నాడని లోకేష్ ఆరోపణలు గుప్పించారు. సీబీఐ పైనే కేసులు పెట్టడం దేశంలో ఏపీలోనే మొదటసారి చూస్తున్నామని లోకేష్ ఎద్దేవా చేశారు.