ఆందోళన బాట పట్టిన సచివాలయం ఉద్యోగులు!
ఏపీ సచివాలయం పూర్తిగా షట్డౌన్ అయ్యేందుకు రోజులు చాలా తక్కువ దూరంలో ఉన్నాయి! శుక్రవారం సచివాలయంలో పనిచేసే సిబ్బంది పీఆర్సీ జీవోలను వ్యతిరేకిస్తూ.. విధులను బహిష్కరించారు. తమ కంప్యూటర్లును షట్ డౌన్ చేసి ఆందోళనకు దిగారు. తక్షణమే ప్రభుత్వం పునారాలోచన చేసుకుని, కొత్త పీఆర్సీ రద్దు జీవోలను రద్దు చేసి.. పాత జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సచివాలయంలోని పలు విభాగాల్లో కింది స్థాయి ఉద్యోగులు విధులను బహిష్కరించడంతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యకలపాలు నిలిచిపోయాయి. అలానే రేపటి నుంచి సమ్మె సన్నాహాక కార్యక్రమాల్లో భాగంగా పెన్ డౌన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీ ప్రకటించింది. అలానే 6 అర్థరాత్రి నుంచి నిర్వీరామ సమ్మెకు దిగుతున్నట్లు ఇప్పటికే ప్రభుత్వానికి నోటీసు ద్వారా సమాచారాన్ని అందజేశారు.
రాజుకున్న దావానలం .. దహించక మానదు!
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులను చిన్నచూపు చూశారు. మనమంతా ఒకే కుటుంబ అనే సెంటిమెంట్ డైలాగ్ ఒకటి కొడితే వాళ్లే పడి ఉంటారని అనుకున్నారు అధికార పార్టీ పెద్దలు,సలహాదారులు! 13 సార్లు చర్చలకు పేరుతో మభ్యపెట్టాలని చూశారు. సమస్యలను పరిష్కరించకుండా.. 13 లక్షల మంది ఉద్యోగులను ఘోరం అవమానించి, వెనక్కిపంపారు. ఇక ఉపేక్షిస్తే లాభంలేదని జగన్ రెడ్డి ప్రభుత్వం ఊహించని అంచనాలతో రివర్స్ గేర్ వేశారు ఉద్యోగులు! మాటలు పొట్టకూటికి అక్కరకు రావాని గ్రహించుకుని ఉద్యోగులు ఆందోళన బాటపట్టారు. ఇప్పుడేమైంది.. నివురుగప్పిన నిప్పు మాదిరిగా ఉన్న ఆవేశం కట్టలు తెంచుకుంది! అదే ఆవేశం రాష్ట్రంలోని అన్ని ఉద్యోగ సంఘాలను ఒక్కతాటిపైకి తీసుకొచ్చి.. కడుపు మంట రగిలిచ్చేలా చేశారు. ఇప్పుడు ఆ సెగలే ప్రభుత్వాన్ని దహించు వేస్తున్నాయి. ఇక జగన్ రెడ్డి ప్రభుత్వం పని అయిపోయిందని, ఉద్యోగుల డిమాండ్స్ నెరవేర్చకుంటే అనేక పరిణామాలను చవిచూడక తప్పదని హెచ్చరికలు మిన్నంటుతున్నాయి. ఈ హెచ్చరికలతో జగన్ రెడ్డి ప్రభుత్వానికి అరచేతిలో భవిష్యత్తు వైకుంఠం మాదిరిగా కనిపిస్తోంది. మరోవైపు ఉద్యోగుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును యావత్తు ముక్తకంఠంతో తీవ్రంగా ఖండిస్తున్నారు. ఉద్యోగులు చేస్తున్న ఆందోళన, నిరసనలు, డిమాండ్స్ పై జగన్ రెడ్డి ప్రభుత్వం తేరుకోకుంటే.. అపజయాలనే అంపశయ్యను ఎక్కక తప్పదని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.











