ఉసురు తీసిన ఆర్టీసీ అధికారులు నిర్ణక్ష్యం!
జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపో అధికారులు నిర్లక్ష్యం, అలసత్వం .. అమాయక ప్రయాణుకుల ఉసురు తీసింది. పది కుటుంబాల్లో విషాదఛాయలు నింపింది. 20 రోజుల క్రితం నుంచి బస్సు రిపేర్లో ఉంది. దానినిన మరమ్మత్తు చేయాలని పదేపదే సిబ్బంది డిపో అధికారులకు మోరపెట్టుకుంటున్న పట్టించుకున్న నాథుడే లేరు. బస్ ఫిట్ నెస్ గురించి పదేపదే ఆర్టీసీ కార్మికులు డిపో మేనేజర్ రమణ దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకున్న దాఖలేవు! అదే సకాలంలో స్పందించి ఉంటే ఇంతటి ఘోర రోడ్డు ప్రమాదం జరిగి ఉండేది కాదని ప్రమాదంలో కుటుంబ సభ్యులను పొగట్టుకున్న బాధితులు బోరుమంటున్నారు.
స్టీరింగ్ పట్టేయ్యడంతోనే ఘోర ప్రమాదం ..!
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం, జల్లెరు వాగులో ఆర్టీసీ బస్సు బోల్తా కొట్టిన ఘనటనలో బుధవారం పది మంది మృత్యవాత పడ్డారు. అశ్వరావుపేట నుంచి జంగారెడ్డిగూడెం వెళ్తున్న ఏపీ 37జెడ్ 193 నెంబర్ గల బస్సు జల్లెరు వాగు వంతెన రెయిలింగ్ ను ఢీకొని 50 అడుగుల ఎత్తు నుంచి వాగులో పడిపోయింది. దాదాపు మూడు గంటల పాటు శ్రమించి క్రేన్ల సాయంతో బస్సును బయటకు తీశారు. ప్రమాద సమయంలో బస్సులో 47 మంది ప్రయాణిస్తున్నారు. మృతి చెందిన పది మందిలో నీటిలో ముగినిపోయి ఎక్కువ సంఖ్యలో మహిళలు, పిల్లలే చనిపోయారు. ప్రమాదానికి గల కారణాలను సిబ్బంది ఆర్టీసీ జోన్ చైర్పర్సన్ తాతినేని పద్మావతికి వివరించారు. బస్సు 20 రోజులుగా మెయింటెనెన్స్ లేదు. స్టీరింగ్ పట్టేస్తుందంటూ డ్రాఫ్ట్ షీట్ లో నమోదు చేసి ఉంది కూడా. మరమ్మత్తులు చేయాలంటూ పదేపదే విన్నవించిన అధికారులు పట్టించుకోలేదు. డ్రైవర్ చిన్నారావు మృతికి బస్సు మెయింటెనెన్స్ లోపమేనని సిబ్బంది ప్రత్యక్షంగా ఆరోపిస్తున్నారు. అదే బస్సు ఫిట్నెస్ బాగుంటే ప్రయాణికులు సురక్షితంగా గమ్యాలకు చేరుకునేవారే. కేవలం డిపో మేనేజర్, అధికారులు వహించిన నిర్లక్ష్యం పది నిండుప్రాణాలు పోవడానికి కారుకులయ్యారని విమర్శలు వెల్లవెత్తున్నాయి. మృతులకు ఇప్పటికే సీఎం జగన్ మోహన్ రెడ్డి రూ. 5 లక్షల చొప్పన, ప్రధాని నరేంద్ర మోదీ రూ.2 లక్షల చొప్పన నష్టపరిహారాన్ని ప్రకటించారు.
Must Read ;- కేంద్ర మంత్రుల వ్యాఖ్యలతో రోడ్డునపడ్డ ఏపీ పరువు..! జగన్ చర్యలే కారణాలా?!











