గాన గంధర్వుడు బాలు మనకు మిగిల్చిన మధుర స్మృతి ఇది. బాలుకు మొదటిసారిగా పాట పాడే అవకాశం ఇచ్చింది ఎస్పీ కోదండపాణి అనే సంగతి అందరికీ తెలిసిందే. హాస్యనటుడు పద్మనాభం నిర్మించిన ‘శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న’సినిమాలో ఆయన తొలిపాట పాడారు. వీటూరి రాసిన ఈ పాట (యేమి ఈ వింత మోహం’ అనే పల్లవితో సాగుతుంది. అప్పుడు బాలు చాలా సన్నగా ఉండేవాడు.
ఆయన ఫొటో చూస్తేనే మనకు అర్థమవుతుంది. నూనూగు మీసాల యవ్వనంతో ఉన్న బాలు అప్పటి ఫొటో మీరు చూస్తున్నదే. మొదటి పాట పాడిన బాలును ఆ సినిమా నిర్మాత, హాస్యనటుడు అభినందించారు. నీకు మంచి భవిష్యత్తు ఉంటుందని కూడా ఆయన అన్నారట. పద్మనాభం కరచాలనం చేస్తున్న ఆ కుర్రాడే మన బాలు. పక్కన బాలు గురువు ఎస్పీ కోదండపాణి. అప్పుడు బాలు వయసు ఇరవయ్యేళ్లు. బాలు విషయంలో ఇది మనకు ఓ అరుదైన జ్ఞాపకం.











