అధికారం దిశగా కాంగ్రెస్ నూతన అవిష్కరణలు..!
ప్రత్యేక రాష్ట్రాన్ని అందించి, తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చిన పార్టీ కాంగ్రెస్! ఇప్పుడు తానందించిన రాష్ట్రంలో అధికారం కోసం సుదీర్ఘ కాలంగా తహతహలాడుతోంది! నాయకత్వ లోపాన్ని సరిచేస్తే బాగుంటుదని భావించిన కాంగ్రెస్ అధిష్టానం.. టీ – పీసీసీ పగ్గాలను రేవంత్ రెడ్డికి అప్పగించింది. దీంతో సీనియర్లు కు మండి, ఆధిపత్యం కోసం కొట్టుకుంటున్నారు. ఎవరేది అనుకున్న తగ్గేదేలే అంటూ రేవంత్ పార్టీ బలోపేతానికి అడుగులు వేస్తున్నారు. తెలంగాణలో సభ్యత్వాల నమోదుపై ప్రత్యేక దృష్టిసారించారు. పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి రూ. 2 లక్షల జీవిత బీమా కల్పించేందకు ప్రణాళికలు సిద్ధం చేశారు.
30 లక్షల డిజిటల్ సభ్యత్వాల నమోదుకు ప్రణాళికలు..!
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 30 లక్ష్లల డిజిటల్ సభ్యత్వాల నమోదును లక్ష్యంగా పెట్టుకుని రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారు. అందుకు తగిన రీతిన పార్టీ శ్రేణులను సిద్దం చేస్తున్నారు. పార్టీ సభ్యత్వం తీసుకున్న కార్యకర్త మరణిస్తే.. రూ. 2 లక్షలు అందించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్న ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పార్టీ కోసం పనిచేసే కార్యకర్త కోసం, పార్టీ కూడా కార్యకర్తలకు అండగా నిలవాలనే దృక్పథంతో ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు 7 లక్షల సభ్యత్వాలు నమోదుకాగా.. మరో 23 లక్షల సభ్యత్వాలను పూర్తి చేసేలా బూత్ లెవల్ పార్టీ ప్రతినిధులతో రేవంత్ టచ్ లో ఉండి ఎప్పటికప్పుడు గైడ్ చేస్తున్నారు. ఒక్కొక్క పొలింగ్ బూత్ నుంచి 100 మందిని కాంగ్రెస్ సభ్యత్వం తీసుకునేలా చర్యలు తీసుకోవాలని రేవంత్ కోరుతున్నారు. అలానే మండలంలో 10 వేలు, అసెంబ్లీలో 50 వేలు, పార్లమెంట్ స్థాయిలో మూడునరలక్షల సభ్యత్వాలు నమోదు చేయించిన వారికి రాహుల్ గాంధీతో సన్మానం చేయిస్తానని రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఇలా పార్టీ సభ్యత్వాల నమోదు కోసం రేవంత్ రెడ్డి చేస్తున్న ఫీట్స్ వర్కౌంట్ అవుతాయా? లేదా? అన్నది చూడాలి!











