చంద్రబాబు అరెస్ట్ తో కుట్రకు తెరతీసిన సీఎం జగన్ రెడ్డి… తమ ప్రభుత్వంపై తీవ్రమైన ప్రజావ్యతిరేకత
వ్యక్తమవుతున్నా తీరు మార్చుకోవటం లేదు. కక్షతో నేతలందరినీ ఏదో రకంగా ఇరికించేందుకు మహా కుట్రను సిద్ధం చేసుకున్నట్టే కనిపిస్తోంది. తలపండిన రాజకీయనేత మాజీ సీఎంను సైతం అరెస్ట్ చేయించిన జగన్ తన పథకంలో భాగంగా మరికొంత మందిని కూడా అరెస్ట్ చేసేందుకు కుట్ర పన్నినట్టు స్పష్టమవుతోంది. అందులో భాగమే లేని ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ పేరుతో యువ నేత లోకేశ్ ను ఇరికించే ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబు ఆస్తులపైనా కన్నేసిన ప్రభుత్వం ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ ను ఏ6 గా చేర్చింది.
చంద్రబాబు సీఎంగా ఉన్న కాలంలో హెరిటేజ్ ఫుడ్స్ కు అనేక ప్రయోజనాలు కలిగించారని.. ముఖ్యంగా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ మార్చడం ద్వారా హెరిటేజ్ ఫుడ్స్ కు ప్రయోజనం కల్పించారని వాదించింది సీఐడీ. దీంతో ఇన్నర్‌రింగ్ రోడ్ కేస్‌లో లింగమనేని, హేరిటేజ్ మధ్య ఉన్న భూముల లింకులపై.. భువనేశ్వరి నుండి జరిగిన ట్రాన్సక్షన్స్ అనుమానాస్పదగంగా ఉన్నాయనే దానిపై వాదనలు జరిగాయి.129 ఆధారాలను గుర్తించినట్లు చెబుతున్న సీఐడీ. దీనిపై మంగళవారం జరిగిన వాదనల్లో లోకేశ్ తరపున్యాయవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్‌లో కూడా హైకోర్టులో లోకేష్ పిటిషన్ దాఖలు చేశారు. 41ఎ సిఆర్‌పిసీ కింద ఇచ్చిన నోటీసుల్లో సిఐడి అధికారులు హెరిటేజ్ బోర్డు మీటింగ్ మినిట్స్‌ను అడిగారని, హెరిటేజ్ భూముల విక్రయాల లావాదేవీలు ఇచ్చేందుకు నిరాకరిస్తూ పిటిషన్ దాఖలు చేశారు. హెరిటేజ్ భూముల లావాదేవీలు అడగడం కూడా పెద్ద కుట్రేనని తెలుగుదేశం పార్టీ నేతల అభిప్రాయం.
అసలు ప్రతిపాదనలకే పరిమితమైన ఇన్నర్ రింగ్ రోడ్డు కోసం ఎలాంటి లావాదేవీలు జరగలేదని, ఆ రింగురోడ్డు ద్వారా ఎలాంటి లబ్దీ ఎవరికీ చేకూరలేదని లోకేశ్ తరపు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా ఆన్ లైన్లో వాదించారు. ఈకేసు విచారణ కోసం బుధవారం లోకేశ్ విచారణకు హాజరుకావాలని సీఐడీ సీఐడీ వాదించింది. సీఐడీనోటీసులపై లోకేశ్ తీవ్ర అభ్యంతరంవ్యక్తంచేశారు. దీంతో బుధవారం జరగాల్సిన విచారణ ఈ నెల 10కి వాయిదా పడింది.