మోకాళ్లపై కూర్చొని వేడుకోలు..!
రుయా ఆసుపత్రిలో కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళన బాట పట్టి రోడ్డెక్కారు. అలిపిరి గురుడ విగ్రహం ముందు నిరసనకు దిగారు. ముందస్తు నోటీసులు లేకుండా ఎఫ్ఎన్ఓ, ఎంఎన్ఓలను తొలగించడం సరికాదని, వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తొలగించిన ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని వంద రోజుల నుంచి రిలే దీక్షలు చేస్తుంటే.. కనీసం రాష్ట్ర ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదని అవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికులు నినాదాలు చేశారు. మోకాళ్లపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సీఎం జగన్ రెడ్డి స్పందించాలని కార్మికులు వేడుకుంటున్నారు.
జగన్ రెడ్డి పాలనలో ప్రభుత్వ, సచివాలయ ఉద్యోగుల పరిస్థితే అద్వానంగా మారితే.. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల పరిస్థితి వర్ణానాతీతంగా తయారైంది!











