సీఎస్ ను కలవనున్న ఉద్యోగులు..
ఉద్యోగుల హక్కుల ప్రకారం అందించాల్సిన పీఆర్సీని ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. తమకు చట్టప్రకారం అందించాల్సిన ఫలాలను ప్రభుత్వం తుంగలో తొక్కుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సినవి, గురుతర బాధ్యతగా అందించాల్సినవి మరిచి.. ఉద్యోగ జేఏసీలను బెదిరిస్తున్నారు. మీరిచ్చిన హామీనే కదా అని గుర్తు చేస్తుంటే ‘డొంట్ క్రాస్ యూవర్ లిమిట్స్’ అంటూ నోరుపారేసుకుంటున్నారు. అదిక్కడి అన్యాయం అంటూ.. ఉద్యోగులు నేటి నుంచి ఉద్యమిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ఏపీ సీఎస్ సమీర్ శర్మకు ఉద్యోగులు సమ్మె నోటీసులు అందించనున్నారు. రేపటి నుంచి దశలవారిగా నిరసన వ్యక్తం చేయడం తోపాటు వచ్చే నెల 6వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు సమ్మెకు ఉద్యోగులు సిద్ధమౌతున్నారు. ఈ నిరవధిక సమ్మెకు ఏపీలో విధులు నిర్వర్తిస్తున్న సకల ఉద్యోగులూ పాల్గొననున్నారు.
కడుపు కాలుతున్న ఉద్యోగులపై సొంత సోషల్ మీడియాలో దుష్ప్రచారం
వైసీపీ పాలనలో రాష్ట్రంలో జరుగుతున్న అకృత్యాలకు ప్రజలు విసిగిపోతున్నారు. సీఎం స్థాయిలో జగన్ రెడ్డి పాలనలో ఏ ఒక్కరూ సంతృప్తిగా లేరు అన్నది వాస్తవం! పక్క రాష్ట్రాలతో పొల్చుకుంటే.. ఏ ఒక్క రంగానికి రాష్ట్రంలో అనుకూల పరిస్థితి కనిపించడం లేదు. ధరలు ఆకాశాన్ని చూడటంతో కొనుగోలు శక్తి .. పొరుగు రాష్ట్రాలకు వలస పోతుంది!! ఇదిక్కెడి అన్యాయం రెడ్డిగారు అంటూ.. రాష్ట్ర ప్రజలు నెత్తినోరుకొట్టుంకుంటు న్నారు. ప్రభుత్వ ఉద్యోగులు సైతం తమ హక్కులను సాధించుకునేందుకు సమ్మె బాట పడుతున్నారు. మరోవైపు జగన్ రెడ్డి చర్యలు విపక్షలు పిచ్చి తుగ్లక్ చర్యలు అంటూ.. అభివర్ణిస్తున్నారు. దేశ చరిత్రలో ప్రముఖంగా ఇటువంటి దారుణ పాలనను ప్రజలు ఏ రాష్ట్రంలో చూడలేదని రాజకీయవేత్తలు విశ్లేషిస్తున్నారు. ఉద్యోగులు తమ హక్కులను ప్రభుత్వానికి గుర్తు చేస్తుంటే.. ఇంకోవైపు పనికట్టుకుని మరి సొంత సోషల్ మీడియాలో దుష్పచారం ప్రారంభించింది అధికార వైసీపీ. దీనిపై ఉద్యోగ సంఘాల నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు.











