సేకండ్ వేవ్ లో కరోనా పంజా విసురుతోంది. రాష్ర్టంలోని ప్రధాన ఆలయాలపై కరోనా ప్రభావం చూపుతోంది. తాజాగా ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన యాదాద్రిలోనూ కరోనా కేసులు వెలుగు చూశాయి. ఇటీవల జరిగిన బ్రహ్మోత్సవాల్లో భక్తులు, ఆలయ అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడంతో కరోనా ప్రభావం చూపింది. బ్రహ్మోత్సవాలకు కర్నాటక, మహారాష్ట్ర కు చెందిన భక్తులు పెద్ద ఎత్తున హాజరుకావడం, కనీసం మాస్కు, భౌతిక దూరం పాటించకపోవడంతో కరోనా విరుచుకుపడింది.
మొదట ఆరుగురికి సిబ్బందికి మాత్రమే కరోనా, బ్రహ్మోత్సవాల కారణంగా 30 మందికి సోకింది. దీంతో కేసులు సంఖ్య 36కు చేరింది. అప్రమత్తమైన అధికారులు ప్రసాదాల తయారీ, అన్నదానం, ఆర్జిత సేవలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. యాదాద్రి మండలం మల్లాపూరంలో 16 కేసులు వెలుగు చూశాయి. భక్తులు కచ్చితంగా వ్యక్తిగత శుభ్రత, మాస్కులు ధరించాలని ఆలయ అధికారులు నిభందనలు పెట్టారు.
Must Read ;- యాదాద్రీశుని సన్నిధిలో కేసీఆర్.. ఆలయ పనులపై కీలక సూచనలు!











