రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రముఖ ఆలయాలు పాక్షికంగా లాక్ డౌన్ ప్రకటిస్తున్నాయి. ఆలయ సందర్శన వేళల్లో కూడా మార్పులు చేస్తున్నాయి. తాజాగా కరోనా కేసులు పెరుగుతుండటంతో సోమవారం నుంచి భక్తులకు నిత్యాన్నదానం తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు శ్రీశైలం దేవస్థానం అధికారులు ప్రకటించారు. దర్శనం అనంతరం భక్తులకు అన్నప్రసాదాన్ని అందజేయనున్నట్లు తెలిపారు. భక్తులు తప్పనిసరిగా మాస్కుల ధరించాలని, వ్యక్తిగత శుభ్రత పాటించాలని ఆలయ అధికారులు కోరుతున్నారు.
Must Read ;- ప్రజల నిర్లక్ష్యంతోనే పెరుగుతున్న కరోనా కేసులు