తెలంగాణ ఐటి మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో చాలా యాక్టవ్‌గా ఉంటారు. రాజకీయంగా ఎంత బిజీగా ఉన్నా.. కొంత సమయాన్న కచ్చితంగా సోషల్ మీడియాకు వెచ్చించి ప్రజలకు సమాధానాలు చెప్పడంతోపాటు.. ప్రతిభను మెచ్చుకుంటారు కూడాను. అంతేకాదు, ఎంతమంది అత్యయిక సమయాల్లో స్పందించి వారికి సహాయం అందించన రోజులు కూడా ఉన్నాయి. తాజాగా కేటీఆర్ ట్వీట్ చేసిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ అద్భుత దృశ్యాన్ని మీరు చూడండి!
https://twitter.com/KTRTRS/status/1353303523794898945?s=20
రెండు కళ్లు చాలునా..
తెలంగాణ సిఎం కేసీఆర్ కలల ప్రాజెక్ట్.. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి గుడికి సంబంధించిన ఓ వీడియోను తన ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. చూసినవారంతా ‘కలియుగ వైకుంఠం.. అద్భుతం.. అనిర్వచనీయం..’ అంటూ కామెంట్లు పెడ్తున్నారు. వర్ణంచడానికి అలివికానంత సుందరంగా తీర్చిదిద్దారంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
కొండపైన కొలువైన నరసింహుడు..
యాదగిరి గుట్టలో కొండపైన కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి గుడి దేశమంతటా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల నుండి దేవుని దర్శనానికి ఎలప్పుడు భక్తులు వస్తుంటారు. కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ గుడికి కలియుగ అద్భుతంగా మలచడానికి పూనుకున్నారు తెలంగాణ సిఎం కేసీఆర్. 2016లో గుడి మరమ్మత్తు పనులు ప్రారంభించారు. బంగారు, వెండి తాపడాలతో గోపురాలు, కని విని ఎరుగని శిల్ప చాతుర్యం.. ఇలా ఎన్నో హంగులతో భక్తులను రంజింపచేయడానికి గుడి సిద్దమవుతున్నది.
Also Read ;- కేటీఆర్ కేబినెట్‌లోకి పొంగులేటి.. కీలక పదవి ఖాయమేనా?











