ప్రస్తుతం ఎక్కడా చూసినా ‘కరోనా.. కరోనా.. కరోనా’ అనే మాటలు మార్మోగుతున్నాయి. సెకండ్ వేవ్ పట్టణాలనే కాదు.. గ్రామాలను సైతం వణికిస్తుంది. మారుమూల గ్రామాల్లోనూ పాజిటివ్ కేసులతో పాటు మరణాలు వెలుగు చూస్తున్నాయి. దీంతో గ్రామాలకు వైరస్ భయం పట్టుకుంది.
అసలే పేదలు.. ఇరుకైనా ఇల్లు.. ఒకటే గది.. ఇలాంటి పరిస్థిత్తుల్లో వైరస్ సోకితే ఏం చేస్తారు పాపం.. అందుకే ఓ శ్మశానమో.. ఉరి చివరన గుడిసెలోనే గడుపుతున్నారు. కుటుంభ సభ్యులకు దూరంగా ఉంటూ కరోనా నుంచి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. గ్రామాల్లోనూ అక్కడక్కడ పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతుండటంతో కొన్ని కుటుంబాలు ఇళ్లను ఖాళీ చేసి పొలాలకు వెళ్తున్నారు. అక్కడే తింటూ, అక్కడే నిద్రపోతూ కరోనాకు దూరంగా గడుపుతున్నాయి. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం మొరం, వాల్మీకిపురం మండలం మంచూరులోని పెరుమాళ్లయ్యగారిపల్లెలోని చాలా కుటుంబాలు పొలాల్లోనే జీవిస్తున్నారు. కరోనా తగ్గాకే మళ్లీ ఊళ్లో అడుగు పెడతామని చెప్తున్నారు గ్రామస్తులు.
Must Read ;- కుప్పం ఆస్పత్రిలో ఆక్సిజన్ ఫ్లాంటు.. రూ.35 లక్షలు ఇస్తున్న చంద్రబాబు











