చిత్తూరు జిల్లా కుప్పం ప్రాంతీయ ఆసుపత్రిలో రూ.35 లక్షలతో ఆక్సిజన్ తయారీ ప్లాంటు ఏర్పాటు చేసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ముందుకు వచ్చారు.దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా కలెక్టర్,కుప్పం ప్రాంతీయ వైద్యశాల మెడికల్ సూపరింటెండెట్‌తో సంపద్రింపులు జరిపారు.కుప్పం ప్రాంతీయ ఆసుపత్రిలో కరోనా రోగుల చికిత్సకు అవసరమైన ఆక్సిజన్ అక్కడే ఉత్పత్తి చేసుకునేందుకు అవసరమైన ప్లాంటు ఏర్పాటుకు రూ.35 లక్షలు ఖర్చవుతుందని అంచనా వేశారు.ఈ మొత్తం భరించేందుకు టీడీపీ అధినేత,కుప్పం టీడీపీ ఎమ్మెల్యే చంద్రబాబునాయుడు ముందుకు వచ్చారు.ప్లాంటు ఏర్పాటు చేస్తున్నట్టు ఇప్పటికే ఇల్లా అధికారులకు తెలియజేశారు. దీంతో రాబోయే కొద్ది రోజుల్లో కుప్పం ప్రాంతీయ ఆసుపత్రిలో ఆక్సిజన్ కష్టాలకు తెరపడనుంది.
ఆక్సిజన్ కష్టాలకు చెక్..
కుప్పం ప్రాంతీయ ఆసుపత్రికి ఆక్సిజన్ తరలించడం సమస్యగా మారిందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు గుర్తించారు.కుప్పం ప్రాంతీయ ఆసుపత్రికి మద్రాసు నుంచి ఆక్సిజన్ తీసుకురావాల్సి ఉంటుంది.ప్రస్తుతం కుప్పం ప్రాంతీయ ఆసుపత్రిలో 300 మంది కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు.ఆక్సిజన్ అవసరాలు కూడా బాగా పెరిగాయి.దీంతో కుప్పానికి ఆక్సిజన్ తరలించడం పెద్ద సమస్యగా మారింది.అందుకే వెంటనే కుప్పం ప్రాంతీయ ఆసుపత్రిలోనే ఆక్సిజన్ ప్లాంటు పెట్టాలని చంద్రబాబునాయుడు నిశ్చయించుకున్నారు.దీంతో కుప్పం ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి.
Must Read ;- హిందూపురం ప్రజల శ్రేయస్సు కోసం రంగంలోకి బాలయ్య