గాలిద్వార కూడా వైరస్ వ్యాపిస్తున్నట్లు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. తాజాగా ది లాన్సెట్ జర్నల్ ఈ కథనం ప్రచురించింది. దాదాపు ఇలాంటి అభిప్రాయాన్నే గతంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధితోపాటు సీసీఎంబీ నిపుణులుకూడా వ్యాఖ్యానించారు. ఆ కథనాలు, అభిప్రాయాల ప్రకారం..
ప్రపంచ వ్యాప్తంగా బ్రిటన్, అమెరికా, కెనడాకు చెందిన ఆరుగురు నిపుణుల బృందం సార్స్ లక్షణాలు ఉన్న కొవిడ్ -2పై అధ్యయం చేసింది. ఈ అధ్యయనంలో వైరస్ సోకిన ఓ వ్యక్తి నుంచి 53 మందికి మళ్లీ వైరస్ సోకిందని తేల్చారు. అయితే ఆ వ్యక్తితో సన్నిహితంగా లేకున్నా, సదరు వ్యక్తి తాకిన వస్తువులను తాకకున్నా ఆ 53మందికి వైరస్ సోకడాన్ని ప్రస్తావించారు. వీటితోపాటు ఓపెన్ ఏరియాలకంటే.. క్లోజ్ ఏరియాల్లో వ్యాప్తికి ఎక్కువగా ఉందని చెప్పడంతోపాటు లక్షణాలు లేని వ్యక్తులనుంచి వైరస్ వేగంగా విస్తరిస్తోందని తేల్చారు. ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో 40శాతం లక్షణాలు లేని వారినుంచే వ్యాప్తి చెందినట్లు తేల్చారు. హోటళ్లలో పక్క గదుల్లో ఉన్న వ్యక్తులకు వైరస్ సోకిందని ఆ టీం తేల్చిందని ఇందుకు కొన్ని శాస్త్రీయ ఆధారాలనుకూడా చూపించారు. గాలిలో ఈ వైరస్ ప్రసరణ, విస్తరణకు రుజువులు లేకున్నా.. డైనమిక్స్ ఆఫ్ ఫ్లుయిడ్ ఫ్లోస్, బ్రతికున్న వైరస్‌ను వేరుచేసి జరిపిన పలు అధ్యయనాల నివేదికలను పూర్తిగా విశ్లేషించారు. అయితే మనిషినుంచి మనిషికి నేరుగా వ్యాప్తిచెందిన వైరస్ కంటే గాలిలో ఉన్న కరోనా వైరస్ కొంత బలహీనాం ఉంటుందని తేల్చారు. మరో వైపు వైరస్ సోకిన వ్యక్తి శ్వాస తీసుకోవడం, వదలడం చేసే సమయంలో వైరస్ బయటకు వెళ్తుందని, ఇప్పటికే పలుమార్లు రుజువైందని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన ఏరోసల్ శాస్త్రవేత్త ప్రొఫెసర్ కింబర్లీ ప్రాథర్ చెప్పారు. ఈ నేపథ్యంలో గాలి, వెలుతురు బాగా ఉండేలా చూసుకోవడం, ఎయిర్ ఫిల్టర్లు ఉండడం, సమూహాలుగా గుమికూడకపోవడం, క్లోజ్డ్ ఏరియాలు లేదా ఇండోర్ ప్రాంతాల్లో వీలైనంత తక్కువగా ఉండడం లాంటి చర్యల వల్ల కొంత నియంత్రింవచ్చని తేల్చారు.
ప్రపంచ ఆరోగ్యసంస్థ..
మరోవైపు ప్రపంచ ఆరోగ్యసంస్థతోపాటు సీసీఎంబీకూడా దాదాపు ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేసింది. జనవరిలోనే ఈ మేరకు సూచనలు, మార్గదర్శకాలు జారీ అయ్యాయియి. గాలి ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుందని ఇప్పటికే అమెరికా వ్యాధుల నియంత్రణ, నిర్మూలన కేంద్రాలు (సీడీసీ) ఇప్పటికే చెప్పగా, సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యూలర్ బయాలజీ (సీసీఎంబీ) కూడా వైరస్ ప్రసరణ గాలిలో సాధ్యమేననే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. కాగా గాలిద్వారా కోవిడ్ వ్యాప్తికి సంబంధించి పరిశోధనలు చేసిన దాదాపు 200మంది శాస్త్రవేత్తలు ప్రపంచ ఆరోగ్యసంస్థకు లేఖలు పంపించారు. ఈ నేపథ్యంలో మరో సారి ప్రపంచ ఆరోగ్యసంస్థ మార్గదర్శకాలు జారీచేసింది. కాగా హైదరాబాద్ కేంద్రంగా ఉన్న సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యూలర్ బయోలజీ(సీసీఎంబీ) కూడా హైదరాబాద్, మోహాలీ నగరాల్లో అధ్యయనం చేపట్టగా కొవిడ్ ఆసుపత్రుల ఆవరణలోని గాలిలో కరోనా వైరస్ వ్యాప్తి సాధ్యమనే అభిప్రాయాన్ని వెల్లడించింది. కొవిడ్ రోగులకు చికిత్స అందిస్తోన్న వార్డులు లేదా ప్రదేశాల్లో వైరస్ ఉంటుందని, అక్కడ గడిపే సమయం, తీసుకునే జాగ్రత్తలు బట్టి తీవ్రత ఆధారపడి ఉంటుందని గతంలోనే సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా తెలిపారు. ఇందుకు సంబంధించి మొత్తం 81ప్రాంతాల్లో (కొవిడ్ వార్డులు, నాన్ కొవిడ్ వార్డుల్లో) అధ్యయనం చేసిన సీసీఎంబీ ఈ మేరకు మార్గదర్శకాలు జారీచేసింది. కేవలం ముందుజాగ్రత్తలు, మాస్కు, పరిశుభ్రత, సోషల్ డిస్టెన్స్ తదితర అంశాలతోనే నియంత్రించవచ్చని సీసీఎంబీ కూడా తేల్చింది.
Must Read ;- కరోనా రోగులతో బెడ్లు ఫుల్.. అన్నిచోట్ల ఆక్సిజన్ టెన్షన్