టాలీవుడ్ అజేయ దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. ఇప్పటి వరకూ ఆయన తెరకెక్కించిన సినిమాలన్నీ సూపర్ హిట్స్ అవడంతో .. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లోకి చేరాడు. ప్రస్తుతం అనిల్ రావిపూడి విక్టరీ వెంకటేశ్ , వరుణ్ తేజ జోడీతో ఎఫ్ 3 అనే మూవీ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. బ్లాక్ బస్టర్ మూవీ ‘ఎఫ్ 2’ కి సీక్వెల్ గా రూపొందుతున్న ఈ సినిమాకి ఆగస్ట్ 27న విడుదల తేదీ లాక్ చేశారు.
ఈ క్రమంలో సినిమాను శరవేగంగా చిత్రీకరిస్తున్నాడు దర్శకుడు. ఇప్పటికే పలు షెడ్యూల్స్ పూర్తి చేసిన చిత్ర బృందం .. తదుపరి షెడ్యూల్ ను మైసూర్ లో ప్లాన్ చేశారు. ఆ మేరకు షూటింగ్ ను కూడా ప్రారంభించారు. అయితే అనూహ్యంగా ఈ సినిమా షెడ్యూల్ కేన్సిల్ అయింది. దానికి కారణం దర్శకుడు అనిల్ రావిపూడికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అవడమే.
ఉగాది రోజున ఎఫ్ 3 తదుపరి షెడ్యూల్ మైసూర్ లో ప్రారంభం కానుందని ప్రకటించిన అనిల్ .. ఇప్పుడు తనకి కరోనా రావడంతో .. స్వీయ నిర్బంధం లోకి వెళ్ళినట్టు తెలుస్తోంది. వెంకటేశ్ దృశ్యం 2 సినిమాను పూర్తి చేయడంతో .. ఎఫ్ 3 సినిమాకి ఎక్కువ కాల్షీట్స్ కేటాయించారట. అయితే ఇప్పుడు దర్శకుడికి కరోనా రావడంతో .. కొత్త షెడ్యూల్ ను రద్దు చేశారు. అనిల్ కరోనా నుంచి కోలుకున్న తర్వాత తదుపరి షెడ్యూల్ డేట్ ఫిక్స్ చేస్తారట. ప్రస్తుతం అనిల్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని సమాచారం.
Must Read ;- వవన్ కళ్యాణ్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ











