వైఎస్ వివేకా హత్యకేసులో ఏ-3 నిందితుడుగా ఉన్న గజ్జల ఉమాశంకర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌ను కడప జిల్లా 4 వ అదనపు కోర్టు న్యాయమూర్తి కొట్టివేశారు.గతేడాది అక్టోబరు 27న వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి ఏ-1గా ఎర్రగంగిరెడ్డి, ఏ-2గా యాదటి సునీల్‌యాదవ్, ఏ-3గా గజ్జల ఉమాశంకర్‌రెడ్డి, ఏ-4గా డ్రైవర్ షేక్ దస్తగిరిలపై అభియోగం మోపుతూ సీబీఐ అధికారులు పులివెందుల కోర్టులో తొలి ప్రాథమిక చార్జిషీట్ నమోదు చేశారు.కాగా, ఎర్ర గంగిరెడ్డి ఇప్పటికే బెయిల్‌పై ఉన్నారు.ఇక మిగిలిన వారిలో దస్తగిరి అప్రూవర్‌గా మారాగా.. సునీల్ యాదవ్, ఉమా శంకర్‌రెడ్డి, డి.శివశంకర్‌రెడ్డి కడప సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. ఇదిలా ఉంటే తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఉమా శంకర్‌రెడ్డి ఈ నెల 3న కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్ పై ఈ నెల 4, 10 తేదీల్లో ఉమాశంకర్‌రెడ్డి, సీబీఐ తరఫు న్యాయవాదులు కోర్టులో తమ వాదనలు వినిపించారు.అయితే తాజాగా బెయిల్ పిటిషన్‌ను కొట్టివేస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. కాగా, దస్తగిరి, వివేకా ఇంటి వాచ్‌మన్ రంగన్న భద్రతపై కడప సెషన్స్ కోర్టులో సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ ఈ నెల 25వ తేదీకి వాయిదా పడింది.
Must Read:-సీబీఐకి టీడీపీ లేఖ.. కడప జైలు సూపరింటెండెంట్ బదిలీ!