యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాముడి పాత్రలోను, బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్రలోను నటించనున్న ఈ చిత్రాన్ని జనవరిలో ప్రారంభించాలని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రావణుడి పాత్ర పోషిస్తున్న సైఫ్ అలీ ఖాన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. దాంతో తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటూ సైఫ్ క్షమాపణలు సైతం చెప్పారు కూడా అయినా సైఫ్ తో పాటు “ఆదిపురుష్” దర్శకుడు ఓంరౌత్ పైన ఉత్తరప్రదేశ్ కు చెందిన నాయవాది హిమాంషు శ్రీవాస్తవ జోన్ పూర్ కోర్టులో పిల్ వేశాడు.
రావణుడిపై సైఫ్ చేసిన వ్యాఖ్యలు హిందూ మత విశ్వాసాలను దెబ్బ తీసేలా ఉన్నాయంటూ తన పిటిషన్లో వివరించారు. సైఫ్ ఓ ఇంటర్వ్యూ లో. రావణుడు సీతను ఎందుకు అపహరించాడు. శ్రీరాముడితో రావణుడు యుద్ధం చేయడం న్యాయమే అంటూ చెప్పుకుని రావడంతో పాటు రాముడితో ఎందుకు యుద్ధం చేశాడు? అనే కోణంలో ఈ చిత్రం ఉంటుందనిఎం రావణాసురిడి లోని మానవత్వ కోణాన్ని ఇందులో ఆవిష్కారిస్తామని సైఫ్ ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. దీంతో సైఫ్ వ్యాఖ్యలు దుమారం రేపడంతో పాటు ఉత్తరప్రదేశ్ లాయర్ పిటిషన్ వేసేందుకు కారణమయ్యాయి.