నెల్లూరు జీజీహెచ్ లో ఒక ఘోరం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. జీజీహెచ్ లోని ఐసొలేషన్ వార్డులో పరమేశ్వరమ్మ అనే మహిళ మృతి చెందింది. కరోనా పాజిటివ్ గా తేలడంతో పరమేశ్వరమ్మ రెండు రోజుల కిందట నెల్లూరు జీజీహెచ్ లో జాయిన్ అయింది. డాక్టర్లు ఒకపక్క వైద్యసేవలు అందిస్తున్నారు గానీ.. ఆమెకు ఉపశమనం కనిపించలేదు. వాంతులు కూడా తగ్గలేదు. దీంతో ఆరోగ్యం గురించి తీవ్రంగా ఆందోళన చెందిన పరమేశ్వరమ్మ ఆత్మహత్య చేసుకుని ఉంటుందని భావిస్తున్నారు.
నెల్లూరు జీజీహెచ్ ఇప్పటికే పలుమార్లు వార్తల్లో నిలుస్తోంది. ఒక ఉన్నతపాఠశాల ప్రధానోపాధ్యాయుడు కొవిడ్ తో ఆస్పత్రికి వెళ్లడం.. బెడ్ దొరక్క ఆవేదనతో చెప్పుకున్న వీడియో వైరల్ కావడం అందరికీ తెలిసిందే. కలెక్టరు, మంత్రి జోక్యం చేసుకున్నాక బెడ్ దొరికినప్పటికీ.. ప్రాణాలు నిలవలేదు. ఇప్పుడిలా.. అదే జీజీహెచ్ లో రోగి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది.
జీజీహెచ్, కోవిడ్ సెంటర్లలో రోగుల్ని ఎవరిష్టానికి వారిని వదిలేస్తున్నారా? ఎలాంటి భద్రత ఏర్పాట్లు లేవా? వారికి కాస్త ధైర్యం చెప్పే వ్యవస్థ ఏమీ లేదా అనే విమర్శలు వస్తున్నాయి. త్మహత్య చేసుకుందని చెబుతున్న డాక్టర్లు..