మరోసారి సుప్రీం కోర్టులో భంగపాటు ఎదురయ్యేసరికి జగన్మోహన్ రెడ్డి మరిన్ని విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తోంది. అమరావతి ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై ఉన్న హైకోర్టు స్టే వెకేట్ చేయించుకోడానికి సుప్రీం కోర్టుకు వెళ్లి జగన్ ఇటీవలే భంగపాటుకు గురయ్యారు. ఇప్పుడు తాజాగా సీఆర్డయే రద్దు చట్టంపై మళ్లీ సుప్రీం తలుపు తట్టినా మరోమారు అదే భంగపాటు తప్పలేదు. హైకోర్టులోనే తేల్చుకోండి ఇక్కడకు రావద్దు అని సుప్రీం కోర్టు తెగేసి చెప్పేసింది.
ఈ నేపథ్యంలో విపక్షాలన్నీ జగన్ సుప్రీం ప్రయత్నాలను తప్పుపడుతున్నాయి. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు నారాయణ మాట్లాడుతూ.. ‘దేశంలో న్యాయవ్యవస్థ ఇన్నిసార్లు చివాట్లు పెట్టిన ముఖ్యమంత్రి ఏపీ సీఎం జగన్ ఒక్కరే… చట్టాలను ధిక్కరించేలా చర్యలు తీసుకుంటున్నారు చట్టాలను కాపాడాలని ప్రయత్నం చేస్తున్న ప్రతిపక్షాలను,కోర్టులను, ఎన్నికల కమిషన్ ను కూడా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు…అని నారాయణ విమర్శించారు.
స్పీకర్ కోర్టును ధిక్కరిస్తున్నారు. మీ మంత్రి తీర్పు వస్తే కోర్టును ఉండనివ్వమని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు… కోర్టు బయట ఫ్యాక్షనిస్ట్ సెటిల్మెంట్ చేస్తూ ,న్యాయవ్యవస్థ ను తిరస్కరిస్తున్నారు…రైతులకు రావాల్సిన డబ్బులు ఇస్తాం గానీ అన్నారు ఇంత వరకు ఇవ్వలేదు. అడిగిన వారిని మహిళలు అని చూడకుండా పోలీస్ స్టేషన్ లలో పెడుతున్నారు అని నారాయణ ఆరోపణలు గుప్పించారు.
ఇదేనా మీ రాజన్న పరిపాలన?
మంత్రి బోత్స సత్యనారాయణ గారికి గత రెండు నెలలుగా అమరావతి రైతుల కౌలు గురించి మన మద్య చర్చలుజరిగాయి . తప్పకుండా చెల్లిస్తామని నాకు వాగ్దానం చేశారు…అయినా ఇంతవరకు అమలుకాలేదు… రైతులకు ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్న ఫలితంగా…ఈరొజు న్యాయం చేయమని కోరిన రైతులను మహిళలతో సహా పొలిసులు నిర్బందిస్తున్నారు… మీవాగ్దానం అమలుచేయడం లో వైఫల్యంచెందిన మీరు రైతులపై చర్య తీసుకునే నైతిక హక్కు ఎక్కడిది…? అని నారాయణ ప్రశ్నించారు.
కోర్టు నుంచి మరిన్ని మొట్టికాయలు రాకముందే.. జగన్ తన నిర్ణయాన్ని పునరాలోచించుకుంటే బాగుంటుందని.. ఇప్పటికే అభాసుపాలు అవుతున్నారని నారాయణ దెప్పిపొడిచారు.