సీపీఐ మాజీ ఎమ్మెల్యే కాకర్లపూడి సుబ్బరాజు (66) కన్నుమూశారు. విజయవాడలోని తన నివాసంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబసభ్యులు స్వయంగా తెలిపారు. అమెరికా నుంచి కుమారుడు, కుమార్తె వచ్చిన తర్వాత అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు బంధువులు తెలిపారు.. సుబ్బరాజు భౌతికకాయాన్ని మార్చురీలో భద్రపరిచారు. సుబ్బరాజు మరణంపై సీపీఐ నేతలు, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. సుబ్బరాజు 1994లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మాజీ ఎమ్మెల్యేల ఫోరం ఛైర్మన్‌గా చాలా కాలం పనిచేశారు. అంతేకాదు ఆయన విజయవాడ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్‌గా, సీపీఐ, అనుబంధ సంఘాల్లో వివిధ హోదాల్లో సుబ్బరాజు సేవలందించారు. ఉమ్మడి ఏపీలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా పనిచేశారు. విజయవాడ ప్రజలకు విశేష సేవలందించారు. ప్రజాసమస్యలపై రాజీలేని పోరాటం చేశారు.
Must Read ;- హిందూపురం మాజీ ఎమ్మెల్యే కన్నుమూత











